Chamomile Tea: చామంతి టీ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే!


Chamomile Tea Benefits: చామంతి పువ్వులతో తయారు చేసిన చామంతి టీ ఒక రుచికరమైన పానీయం. ఈ చామంతి టీతో అనేక రకాల ఆరోగ్య లాభాలను పొందవచ్చు.  

  • Apr 13, 2024, 18:27 PM IST

Chamomile Tea Benefits: సాధారణ టీ, కాఫీలు కంటే హెర్బల్‌ టీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగే ఈ చామంతి టీ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. చామంతి టీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని రుచి  ఆరోగ్య ప్రయోజనాలకు గురిచి మీరు తెలుసుకోండి.

1 /5

చామంతి టీలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంగ్జయోలిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ టీ తీసుకోవడం వల్ల సుఖమైన నిద్ర పొందవచ్చు. 

2 /5

చామంతి టీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, వాంతులు, విరేచనాలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

3 /5

చామంతి టీ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నవారు ఈ టీ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

4 /5

చామంతి టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో  సహాయపడతాయి.

5 /5

చామంతి టీకి నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది తలనొప్పి, పీరియడ్ నొప్పి,  కండరాల నొప్పులకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.