Virat Kohli: నాలుగో స్థానంలో అత్యధిక సెంచరీలు బాదిన టాప్-5 బ్యాట్స్‌మెన్స్ వీళ్లే..!

Top 5 Batsmen With Most Test Centuries: వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ వేదిక జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో  విరాట్ కోహ్లీ 121 పరుగులతో విదేశాల్లో సెంచరీ కరువును తీర్చుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్ల తరువాత విదేశీ గడ్డపై శతకం బాదాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను మరింత చిరమస్మరణీయంగా మార్చుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఎక్కువ శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో నాలుగోస్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో నాలుగోస్థానంలో అత్యధిక సెంచరీలు బాదిన టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేండి.
 

1 /5

క్రికెట్ దేవుడు, టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సెంచరీలు బాదాడు. 44 శతకాలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.  

2 /5

దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్ టెస్ట్ క్రికెట్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్‌లో 35 సెంచరీలు సాధించాడు.   

3 /5

శ్రీలంక లెజెండరీ బ్యాట్స్‌మెన్ మహేల జయవర్దన  4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 30 సెంచరీల బాదాడు.   

4 /5

ఆ తరువాత స్థానంలో విరాట్ కోహ్లి నిలిచాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 25 శతకాలు చేశాడు.   

5 /5

వెస్టిండీస్ బ్యాటింగ్ మాస్ట్రో బ్రియాన్ లారా టెస్టు క్రికెట్‌లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ మొత్తం 24 సెంచరీలతో జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు.