Tollywood highest Theatres Count: వరల్డ్ వైడ్ గా ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలైన చిత్రాలు.. పార్ట్ -2

Tollywood highest Theatres Count: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలు ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించాయి. దీంతో ఆయా సినిమాలు విడుదలయ్యే థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి.

1 /6

సలార్ పార్ట్ -1 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6200 స్క్రీన్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు పోటీగా షారుఖ్ ‘డంకీ’ మూవీ విడుదల కావడంతో ఈ సినిమాకు తక్కువ స్క్రీన్స్ దక్కాయి. 

2 /6

ఆదిపురుష్ ప్రభాస్ ప్రభు శ్రీరామచంద్రుడిగా యాక్ట్ చేసిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకు స్క్రీన్స్ లో విడుదలైంది. 

3 /6

సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4632 థియేటర్స్ లో విడుదలైంది.

4 /6

బాహుబలి  పార్ట్ -1 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి పార్ట్ -1’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే 4 వేల స్క్రీన్స్ లో విడుదలైంది.

5 /6

పుష్ప పార్ట్ -1 అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప పార్ట్ -1’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.

6 /6

లైగర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘లైగర్’. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా 3000 పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.