Fathers Day 2021 Wishes: తమ హీరోలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సెలబ్రిటీలు

తమ రియల్ లైఫ్ హీరోలు అయిన నాన్నకు టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రేమ, విలువ, స్ఫూర్తిని ఎలా పంచారో తెలుపుతూ కొందరు ట్వీట్ చేయగా, వారంటే తమకు ఎందుకంత ఇష్టమో మరికొందరు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మీకోసం.

Fathers Day 2021 Wishes in Telugu : తమ రియల్ లైఫ్ హీరోలు అయిన నాన్నకు టాలీవుడ్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రేమ, విలువ, స్ఫూర్తిని ఎలా పంచారో తెలుపుతూ కొందరు ట్వీట్ చేయగా, వారంటే తమకు ఎందుకంత ఇష్టమో మరికొందరు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మీకోసం.

1 /6

 Fathers Day Wishes :మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ  బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay అని మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే విషెస్ తెలిపారు.  (Photo Credit: Twitter)

2 /6

నాన్న స్ఫూర్తితోనే బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాను, నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాకు రాత్రి 3 గంటలకు ఏ ఒత్తిడి అనిపించినా నాకు గుర్తొచ్చే వ్యక్తి నాన్న అంటూ టాలీవుడ్ నటి ప్రణీత సుభాష్ తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.  (Photo Credit: Twitter)

3 /6

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తండ్రి మెగా బ్రదర్, నటుడు నాగబాబుకు Fathers Day Wishes తెలిపారు. తండ్రితో చిన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసుకున్నారు.   (Photo Credit: Twitter)

4 /6

నా హీరో, నా బలం, నా వెలుగు, స్ఫూర్తి ఇవన్నీ కలిపితే మీరు. వీటికంటే మీరు ఎక్కువ నాన్న. ఈరోజు మాత్రమే కాదు ఎన్నటికీ ఫాదర్స్ డే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామంటూ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు ఫాదర్స్ డే సందర్భంగా మహేష్ బాబు విషెస్ తెలిపారు.  (Photo Credit: Twitter)

5 /6

ప్రియమైన నాన్నకు,  మీరు నాతో లేకపోయి ఉండొచ్చు. కానీ మీ ఫెవరెట్ స్కూటర్ ఎన్నటికీ నాతోనే ఉంటుంది. ఇది నాకు వెలకట్టలేని ఆస్తి. నిన్ను మాత్రం ఎప్పుడూ మిస్ అవుతాను. హ్యాఫీ ఫాదర్స్ అని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేశారు.  (Photo Credit: Twitter)

6 /6

టాలీవుడ్ నటి రాశీ కన్నా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (Photo Credit: Twitter)