Death Creatures at Beach: సముద్రతీరాన వేలాది జంతు మృతదేహాలు, సోషల్ మీడియాపై నెటిజన్ల ఆగ్రహం

యూకే సముద్రతీరంలోని ఒక బీచ్ వద్ద వేలాది జంతువుల, జీవాల మృతదేహాలు కన్పించడంతో కలకలం రేగింది. బీచ్ వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొచ్చాయి. భారీ ఎత్తున జంతువుల మృతిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జంతు మృతదేహాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రోగాలు వ్యాప్తి చెందుతాయనే ఆందోళన నెలకొంది. 

Death Creatures at Beach: యూకే సముద్రతీరంలోని ఒక బీచ్ వద్ద వేలాది జంతువుల, జీవాల మృతదేహాలు కన్పించడంతో కలకలం రేగింది. బీచ్ వద్ద భారీ సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొచ్చాయి. భారీ ఎత్తున జంతువుల మృతిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జంతు మృతదేహాల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రోగాలు వ్యాప్తి చెందుతాయనే ఆందోళన నెలకొంది. 
 

1 /5

బీచ్‌పై సముద్ర జీవాల మృతదేహాలు చూసి స్థానికులు భయకంపితులవుతున్నారు. ఆగ్రహంతో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్లు అందుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో సముద్ర జీవాల మృతికి బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. 

2 /5

గత 21 ఏళ్లుగా ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదంటున్నారు స్థానికులు. తుపాను తరువాత కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదట.

3 /5

గత రెండు వారాల్నించి బీచ్‌పై సముద్ర జీవాల మృతదేహాలు భారీగా కొట్టుకొచ్చాయని అక్కడికి వాకింగ్ నిమిత్తం వచ్చేవాళ్లు చెబుతున్నారు. 

4 /5

దర్యాప్తు ప్రారంభమైందని ఓ పర్యావరణ సంస్థ వెల్లడించింది. అయితే కాలుష్యం కారణంగానే ఇదంతా జరిగిందనేది ప్రముఖంగా విన్పిస్తున్న వాదన.

5 /5

డైలీ స్టార్ రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక బీచ్‌లో వేలాది సముద్ర జీవాల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ జీవాల్లో పీతలు, లాబ్‌స్టర్స్, ఇతర జంతువులున్నాయి. ఈ జీవాల మృతదేహాలన్నీ ఉప్పుతో కప్పబడి ఉన్నాయి.