Kendra Trikona Rajayogam Effect: వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు స్వస్థానం, శనీ దేవుడికి ఉచ్చ స్థానమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశం వలన వలన శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. దీంతో 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని రాజయోగాలు ఏర్పడతాయి. అలాంటి వాటిలో శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజకీయ యోగం వల్ల కొన్ని రాశుల వారు గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అందుతుంది.
అంతేకాదు వివాహాం కానీ వారికి ఈ సమయంలో పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 18న శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో ప్రవేశించాడు. ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం 30 యేళ్ల తర్వాత ఏర్పడబోతుంది
మేషరాశి.. కేంద్ర త్రికోణ రాజయోగం వలన మేష రాశి వారికీ ఉద్యోగ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. అంతేకాదు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్ కు అవకాశం ఉంది. అంతేకాదు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలను పొందే అవకాశాలున్నాయి. గతంలో కంటే మీ ఆదాయ వనరులు పెరుగుతాయి.
మిథున రాశి.. కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. 2025 మార్చి వరకు జీవితం బంగారు మయంగా ఉండబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పక ఉద్యోగ అవకాశం లభించే ఛాన్సెస్ ఉన్నాయి.
సింహ రాశి.. కేంద్ర త్రికోణ రాజయోగం వలన సింహ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. వివాహా ప్రయత్నాలు ఫలమిస్తాయి. పెళ్లి వారికీ ఇది యోగ కాలం. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ సమస్యలన్ని పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.
తులా రాశి.. తులా రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ప్రవేశం వలన కేంద్ర త్రికోణ రాజయోగం వలన తులా రాశి వారికీ గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి. మీ కెరీర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించి రెండింటిలోను ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. వ్యాపారస్తులకు ఇది భారీ లాభం చేకూర్చే అవకావాలున్నాయి. పెళ్లి కానీ ఈ సమయంలో ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది.
కుంభ రాశి.. కుంభ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం వలన గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు. గత కొన్నేళ్లుగా మీలో లోపించిన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మొత్తం మీద మీ జీవితంలో రాజ యోగం అనుభవిస్తారు.
గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.