Immunity Booster: ఇంట్లో లభించే ఈ దినుసులు ఇమ్యూనిటీని పెంచుతాయి

ఇంట్లో సులభంగా లభించే దినుసులతో సులభంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు

  • Sep 20, 2020, 15:37 PM IST

ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ రోజుల్లో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్లో సులభంగా లభించే దినుసులతో సులభంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఖర్చతు తక్కువ దాంతో పాటు  దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు

1 /5

పసుపు పాలు తాగడం వల్ల జలుబు దగ్గు తగ్గుతుంది. వేడి పాలలో కొంచెం పసుపు కలపి తాగడ వల్ల ఇమ్యూనిటీ పెరగడమే కాదు ఎముకలు కూడా పటిష్టం అవుతాయి. 

2 /5

ఇమ్యూనిటీని పెంచడంలో లవంగాలు ముందుంటాయి. పోపుల డబ్బాలో  తప్పకుండా ఉండే లవంగాలు ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గును తగ్గిచడంలో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే  యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మ నిగారింపు వస్తుంది.   

3 /5

అల్లం, తులసి కాంబినేషన్ ఇమ్యూనిటీని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పిని తగ్గిస్తాయి

4 /5

ప్రతీ వంటగదిలో అందుబాటులో ఉంటుమంది. దాల్చిని వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియా అంశాల వల్ల శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది. 

5 /5

ఆరోగ్యానికి ఉసిరి చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.  ఇందులో కాల్షియం, అర్సెనిక్, ఫాస్ఫరస్, ఫైబర్, కార్బో హైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతీ రోజు ఉసిరి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.