VC Sajjanar: ఎంతకు తెగించావ్ రా.. ఫేమస్ పిచ్చికి పరాకాష్ట ఇది: సజ్జనార్ ఫైర్

Instagram Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత హద్దులు దాటుతోంది. లైక్స్, ఫాలోవర్స్ పెంచుకునేందుకు పిచి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ ప్రాణాలను కూడా పొగొట్టుకున్నారు. తాజాగా ఓ యువకుడు చేసిన వీడియోపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేమస్ పిచ్చికి పరాకాష్ట అని వీడియోను పోస్ట్ చేశారు.


 

1 /5

ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను ఓ అమ్మాయి మోసం చేసిందని.. చనిపోతున్నా ఫ్రెండ్స్ అంటూ వీడియో తీసుకున్నాడు.  

2 /5

ఎవరైనా కాపాడేవారు రండి ఫ్రెండ్స్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను ట్వీట్ చేసిన సజ్జనార్.. సోషల్ మీడియా ఫేమస్ పిచ్చికి పరాకాష్ట ఇది అని అన్నారు.  

3 /5

"ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం ఈ మహానుభావుడు ఎంతకు తెగించాడో చూడండి. తన వెర్రి చేష్టలకి 4.4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని అదేదో ఘనకార్యం సాధించినట్లు మరొక వీడియోను వదిలాడు.   

4 /5

సోషల్ మీడియాలో ఫేమస్ పిచ్చి పట్టుకున్న వీరంతా  సామాజిక విద్రోహులు. వ్యూస్, లైక్స్, కామెంట్ల కోసం వారు ఎంత దూరమైన వెళ్తారు. ఇలాంటి సామాజిక ద్రోహులకు దూరంగా ఉండండి. 

5 /5

సోషల్ మీడియానే జీవితం కాదు. వ్యక్తిగత గుర్తింపు సోషల్ మీడియా ద్వారానే వస్తుందనే  భ్రమలోంచి యువత బయటకి రావాలి. కష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చనే విషయాన్ని గ్రహించాలి.." అని సజ్జనార్ సూచించారు.