Python Eats Woman: పాములు అత్యంత ప్రమాదకరమైనవి. అందుకే చాలామందికి పాము పేరు వింటేనే జలదరింపు వస్తుంటుంది. అలాంటిది ఓ మహిళను ఓ పాము సజీవంగా మింగేస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ..అదే జరిగింది ఇండోనేషియాలో. ఆ భయంకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Python Eats Woman: ఇండోనేషియాలోని దక్షిణ సులావేసీ ప్రాంతంలోని కళేమపాంగ్ గ్రామంలో మూడ్రోజులుగా ఓ మహిళ కన్పించకపోవడంతో ఊరంతా కలిసి గాలించారు. చివరికి ఓ కొండ చిలువ కడుపులో ఆ మహిళ మృతదేహమై కన్పించింది.
ఈ 45 ఏళ్ల మహిళ కొండచిలువకు బలైంది. మూడ్రోజులుగా కన్పించని మహిళను ఆ కొండ చిలువ పొట్టలో ఉన్నట్టు గమనించారు. ఈ కొండ చిలువ దాదాపు 16 అడుగులుంది.
మధ్య ఇండోనేషియాలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ కొండ చిలువ పొట్టలో మృతదేహమై కన్పించింది. ఆ మహిళను కొండచిలువ పూర్తిగా మింగేసింది. నలుగురు పిల్లల తల్లి అయినా ఫరీదా మూడ్రోజుల్నించి కన్పించలేదు. దాంతో ఆ మహిళ కోసం భర్త, గ్రామస్థులు కలిసి వెతకడం ప్రారంభించారు
ఈ క్రమంలో ఆ మహిళ వస్తువులు కొన్ని ఓ చోట లభించాయి. దాంతో ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. కొద్దిదూరంలోనే కడుపు బాగా ఉబ్బిపోయున్న ఓ కొండ చిలువను గమనించారు. వెంటనే గ్రామస్థులు ఆ కొండచిలువ పొట్టను కోసి చూడగా నిర్ఘాంతపోయారు. 45 ఏళ్ల ఫరీదా మృతదేహమై కన్పిచింది.
ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇటీవలి కాలంలో కొండచిలువల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న కేసులు అధికంగానే ఉంటున్నాయి. గత ఏడాది ఇలాంటి ఘటనే జరిగింది.