Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?

Theatres Closed in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పదిరోజులపాటు తాత్కలికంగా థియేటర్లు బంద్‌ కానున్నాయి. ఇటీవలె జరిగిన ఎన్నికలు ఇతర కారణాల వల్ల థియేటర్లలో సినీ ప్రేక్షకులు ఎక్కువగా కనిపించకపోవడంతో తెలంగాణ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 

1 /5

ఆ మధ్య వచ్చిన డీజే టిల్లు స్క్వేర్ తర్వాత థియేటర్లలో జనాలను అలరించగలిగే సినిమాల విడుదల జరగలేదు. పైగా పెద్ద హిరోల సినిమాలు, పెద్ద సినిమాలు విడుదల కూడా లేకపోవడంతో థియేటర్లన్ని వెలవెలబోయాయి. పట్టణంలో కంటే ఊళ్లలో ఉండే థియేటర్ల పరిస్థితులు మరింత దారుణంగా మారింది.   

2 /5

ఇటీవల లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగాయి. ఏపీలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హడావుడితోనే గత నెలరోజులు గడిచింది. ప్రేక్షకులని అలరించే సినిమాలు కూడా పెద్దగా విడుదల కాకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  

3 /5

ఈనేపథ్యంలో ఎక్కువ శాతం సినీ ప్రేమికులు థియేటర్లలో కనిపించలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు వెలవెలబోయాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ లేకుండా పోయింది.  

4 /5

చిన్న సినిమాలు, అంతగా అలరించని సినిమాలు మరే ఇతర కారణాలు కావచ్చో కానీ, ఎక్కువ ప్రేక్షకులు లేకపోవడంతో సినిమా థియేటర్లకు వచ్చే సినీ ప్రేమికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈనేపథ్యంలో థియేటర్లను తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్‌ నిర్ణయించింది.  

5 /5

తెలంగాణ వ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు పదిరోజులపాటు షోలు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం నుంచి పదిరోజులపాటు థియేటర్లు మూసివేయనున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )