Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పని వేళలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ పరిధిలో వ్యాపారాలు నిర్వహించే సముదాయాలు ముఖ్యంగా బార్లు, రెస్టారెంట్లు, కాఫీ, పాన్ షాపుల పనివేళలు ఇక పై అర్ధరాత్రి ఒంటి గంట వరకు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు సూపర్ మార్కెట్లు, జువెలరీ, దుస్తులు, కిరాణా ఇతర దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 వరకు నిర్వహించుకోవచ్చు. దీనికి సంబంధించి మంగళవారం రోజు ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
వైన్స్ లిక్కర్ అవుట్‌లెట్లు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి (GHMC) వచ్చే షాపుల సమయాను కూడా పొడగించారు. ఈ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకోవచ్చు.
జీహెచ్‌ఎంసీ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల నిర్వహణ వేళలు కూడా పెంచింది. వీక్ డేస్ (శని, ఆది) తప్ప మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక వీకెండ్‌లో అయితే ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు ఓపెన్ ఉంటాయి.
ఇక ఫుడ్ బిజినెస్‌లు ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పొడగించారు. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబా, ఐస్‌క్రీమ్ పార్లర్, బేకరీ, టిఫిన్ సెంటర్లు, కాఫీ షాపులు, టీ స్టాళ్లు, పాన్ షాప్స్ అర్ధరాత్రి 1 వరకు నిర్వహించుకోవచ్చు.
ఈ ఆర్డర్లకు సంబంధించి డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓలకు ఆధ్వర్యంలో ఉంటాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠినచర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.