Liquor shops: మందుబాబులు ఎగిరి గంతేసే వార్త.. వీకెండ్‌లో మద్యం దుకాణాల వేళల్లో భారీగా పొడిగింపు..

Hyderabad: లిక్కర్ షాపుల వేళల్లో జీహెచ్ఎంసీ పరిధిలో సవరించినట్లు తెలుస్తోంది. ఇక మీదట వీకెండ్ లలో కూడా ఎక్కువగా సేపు తెరిచి ఉంచుకునే విధంగా రేవంత్ సర్కారు కీలక  ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
 

1 /7

జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు కూడా హోటల్స్, రెస్టారెంట్ లు, వైన్ షాపులలో గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట రాత్రిపూట షాపులు తెరిచి ఉంచడంపైన అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.  

2 /7

ఈ నేపథ్యంలో.. నగర సీపీ సీవీ ఆనంద్.. అంతర్గతంగా పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్క్యూలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం మినహా ఆహారపు సరఫరాకు సంబంధించిన ఇతర హోటల్స్‌ను అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చంటూ  సీపీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. 

3 /7

హైదరాబాద్‌లో రాత్రి 10 గంటలకే దుకాణాలు మూసేస్తూ ప్రజలపై లాఠీ ఛార్జీ చేస్తున్నారని, కొన్నిరోజులుగా ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రులు,  నేతలకు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

4 /7

ఈ క్రమంలో..  సీఎం అర్ధరాత్రి రాచకొండ, సైబరాబాద్, హైదరబాద్ ల పరిధిలో దుకాణాలు తెరుకోవచ్చంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. మెయిన్ గా.. మద్యం దుకాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరుచుకోవచ్చని ఆదేశించారు.

5 /7

అదే విధంగా.. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు జీహెచ్‌ఎంసీకి 5 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలలోని బార్లు(2బీ)లలో మద్యం సరఫరా చేయడానికి మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు (వర్కింగ్ డేస్ లలో), వారంతంలో (శుక్ర, శనివారాలలో) రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

6 /7

మరోవైపు.. బట్టలు, బంగారం దుకాణాలు, సూపర్‌ మార్కెట్లు, ఎలక్ట్రానిక్‌ దుకాణాలు, సెల్‌ ఫోన్‌ షాప్స్‌, జనరల్‌ అండ్‌ కిరాణా స్టోర్స్‌ బుక్‌ స్టాల్స్‌ ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు తెలుస్తోంది.  

7 /7

ఫుడ్ ఐటమ్స్ కు సంబంధించి.. తెలంగాణలో..  ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచుకోవచ్చు. అయితే హోటల్స్‌, రెస్టారెంట్స్‌, దాబా, ఐస్‌క్రీమ్‌ పార్లర్స్‌, బేకరీస్‌,స్వీట్ షాపులు,  టిఫిన్‌ సెంటర్స్‌, కాఫీ షాప్స్‌, టీ స్టాల్స్‌, పాన్‌  దుకాణాలు ఒంటి గంట వరకు తెరుచుకోవచ్చని సూచించారు. ఈ ఆదేశాలు ప్రభుత్వం నుంచి అధికారికంగా రావాల్సి ఉందని తెలుస్తోంది.