Tamannaah Bhatia: చీరలో తమన్నా ఫోటోలు.. ఎంతో పద్ధతిగా!

Tamannaah Bhatia Bold Photos:

తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ హీరోయిన్ ఈ మధ్య నటించిన బాక్ సినిమా నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి ప్రేక్షకులను అలరిస్తోంది.

1 /5

తెలుగు ప్రేక్షకుల మదిలో తమన్నాకి ప్రత్యేక స్థానం ఉంది. మంచు మనోజ్ హీరోగా చేసిన శ్రీ సినిమాతో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది ఈ హీరోయిన్.

2 /5

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా తమన్నాని స్టార్ హీరోయిన్గా మార్చింది. అప్పటినుంచి వరస అవకాశాలు ఈ హీరోయిన్ సొంతమయ్యాయి.

3 /5

వెంకటేష్ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు తెలుగులో దాదాపు అందరూ హీరోలతో జోడికట్టి మంచి విజయాలు సాధించింది ఈ ముద్దుగుమ్మ.

4 /5

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తమన్నా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలు సాధించింది. ఈ మధ్యనే తమన్నా నటించిన అరణ్⁠మనై 4, చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  

5 /5

ఈ సినిమానే తెలుగులో బాక్ గా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలను తమన్నా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి కాస్త తెగ వైరల్ అవుతున్నాయి