Supreme court sensational om aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది. ఓ కేసు విషయంలో వయస్సు ధృవీకరణకు కేవలం స్కూలు సర్టిఫికేట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
సుప్రీం కోర్టు ఆధార్ కార్డు విషయంలో సంచలన తీర్పు నిన్న వెలువరించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు బంధువులు 2015 జరిగిన ఘటనలో పరిహారం తగ్గడంపై కోర్టును ఆశ్రయించారు.
దీనిపై పంజాబ్, హరియాణా హైకోర్టులు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గింది దీంతో వారు సుప్రీం కోర్డుకు పిటిషన్ దాఖలు చేశారు. సదరు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
ఇకపై ఆధార్ కార్డును వయస్సు ధృవీకరణకు ప్రామాణికంగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. కేవలం స్కూలు సర్టిఫికేట్లపై ఉన్న వయస్సు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
ఈ ఘటనలో ఓ వ్యక్తి 2015 రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించాడు. అతనికి రూ.19.35 లక్షల పరిహారం రోహ్‌తక్ మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ (MACT) ప్రకటించింది.. అయితే, వయస్సు ధృవీకరణ తప్పు దొర్లిందని ఆ ఎక్స్‌గ్రేషియాను రూ.9.22 లక్షలకు తగ్గించారు.
ఎక్స్‌గ్రేషియా కోసమే ఇలా వయస్సును తగ్గించి చూపించారని ఎంఏసీటీ ఆరోపించింది. సదరు మృతుడి ఆధార్ కార్డుపై కూడా చూస్తే ప్రస్తుతం 47 ఏళ్లు ఉందని హైకోర్టులో వాదించింది. ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది మృతుడి కుటుంబీకులు స్కూలు సర్టిఫికేట్ ఆధారంగా 45 ఏళ్లు అని ధృవీకరించారు. దీంతో వారికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.