Sreeleela photos : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న శ్రీలీల గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ శ్రీలీల ఫొటోస్ కుర్రకాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో.. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేయడం వల్ల ఆమె స్టార్ హీరోయిన్గా మారింది. శ్రీలీల తన కెరీర్‌ను సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
ఆ తర్వాత శ్రీలీల రవితేజతో జోడీగా నటించిన ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ విజయం ఆమెకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తూ శ్రీలీల తన టాలెంట్‌ను ప్రదర్శించింది. ఆమె ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండతో మరో ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా ఉంది.
ఇటీవల, శ్రీలీల తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. బ్లాక్ కలర్ శారీ, డిజైనర్ బ్లౌజ్ ధరించి శ్రీలీల తీసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలలో ఆమె అందం, స్టైల్ కుర్రకారును విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆమె చూపులు, భంగిమలు కుర్రాళ్లను మైమరిపిస్తున్నాయి.
ఈ ఫొటోలు చూడగానే నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గ్లామర్ షోతో పాటు ఆమె కెరీర్ పట్ల సీరియస్‌గా ఉన్న శ్రీలీల, తెలుగు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా అవకాశాలను పొందేందుకు కృషి చేస్తోంది.
ఇంతకుముందు బాక్సాఫీస్ వద్ద కొన్ని చిత్రాలు నిరాశపరిచినప్పటికీ, ప్రస్తుతం శ్రీలీల తన గ్లామర్ ట్రీట్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ తన గుర్తింపు నిలబెట్టుకుంటోంది.