Sobhita: చైతూ కోసం ఎవరూ చేయని పని చేసిన శోభిత...!

Naga Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు నాగచైతన్య. అయితే ఈయన కూడా తన తండ్రిలాగే రెండు వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండవ వివాహం చేసుకున్న నాగచైతన్య కోసం ఆయన రెండవ భార్య ఎవరు చేయని పని చేసిందట. 

1 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగచైతన్య. అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం టైర్ -2 హీరోగా చలామణి అవుతున్నారు నాగచైతన్య. ఇదిలా ఉండగా ఏ మాయ చేసావే సినిమా సమయంలో తనతోపాటు నటించిన సమంతతో ప్రేమలో పడ్డ ఈయన ఏడేళ్ల పాటు ప్రేమించుకుని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీగా వచ్చిన మనం సినిమా తర్వాత వివాహం చేసుకున్నారు. 

2 /5

2017లో వీరి వివాహం జరగగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. ఇక 2021 అక్టోబర్ 2 న విడాకుల ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ జంట ఇక విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. 

3 /5

ఇదిలా ఉండగా నాగచైతన్య,  సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాలతో డేటింగ్ చేశారు. ఇక ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 4న వివాహం చేసుకొని ఒక్కటి అయ్యారు. ఇదిలా ఉండగా శోభిత నాగచైతన్య కోసం ఎవరూ చేయని త్యాగం చేసిందట అదేంటో ఇప్పుడు చూద్దాం. 

4 /5

అసలు విషయంలోకి వెళితే.. నాగ చైతన్యను శోభిత వివాహం చేసుకోవాలంటే.. పెళ్లి తర్వాత ఎటువంటి బోల్డ్, వెబ్ సిరీస్లలో సినిమాలలో నటించకూడదని పెళ్లికి ముందే కండిషన్ పెట్టారట.   

5 /5

ఇక నాగచైతన్య మీద ఎంతో ప్రేమ ఉన్న శోభిత ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక వివాహం తర్వాత బోల్డ్  సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయనని చెప్పింది. మరి ఏ మేరకు తన మాటకు కట్టుబడి ఉంటుందో చూడాలి