Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల 5 ట్రెండింగ్‌ శారీ కలెక్షన్స్‌.. పార్టీల్లో మీరే సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌..

Sobhita Dhulipala 5 Elegant Saree Looks: శోభిత ధూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్‌ ఈ మధ్య కాలంలోనే చేసుకున్నారు. తెనాలికి చెందిన ఈ తెలుగందం ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఎన్ని సౌత్‌ ఇండియాతోపాటు బాలివుడ్‌ సినిమాల్లో కూడా నటించిన ఈ భామ ప్రస్తుతం ఓ హాలివుడ్‌ మూవీలో కూడా నటిస్తున్నారు.
 

1 /7

శోభిత ధూళిపాళ్ల అత్యంత అందమైన ఇండియన్‌ మోడల్స్‌లో తను కూడా ఒకరు. కొన్ని టీవీ షోల్లో కూడా ఈమె కనిపించారు. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, మంకీ మ్యాన్‌, ది నైట్‌ మేనేజర్‌, పొన్నియన్‌ సెల్వన్‌ I, II, గూఢచారి, రామన్‌ రాఘవ్‌ 2.0, మేజర్‌ వంటి సినిమాల్లో ఆమె నటించారు.  

2 /7

అయితే, శోభిత ధూళిపాళ్ల ఫ్యాషన్‌ సెన్స్‌కు పెట్టింది పేరు. ఈమె శారీ కలెక్షన్స్‌ అదుర్స్‌ ఈరోజు అలాంటి కొన్ని ట్రెండింగ్‌లో ఉన్న శోభిత ధూళిపాళ్ల శారీ డిజైన్స్‌ ఏంటో ఓ లుక్కేద్దాం.  

3 /7

గోల్డెన్‌ టిష్యూ శారీ.. మీరు ఏదైనా పార్టీకి వెళ్లాలనుకుంటే ఈ శారీ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల గోల్డెన్‌ టిష్యూ శారీ ధరించారు. ఇది ప్లెయిన్‌ శారీ, దీనిపై ఏ వర్క్‌ కూడా లేదు. దీనిపై హెవీ వర్క్‌ ఉన్న బ్లౌజ్‌ వేసుకుంటే పర్పెక్ట్‌గా సెట్‌ అవుతుంది. మీకు కావాలంటే ఈ శారీపై ప్లెయిన్‌ బ్లౌజ్‌ కూడా ధరించవచ్చు.

4 /7

రెడ్‌ వైట్.. శోభిత ధూళిపాళ్ల ఈ శారీలో ఓ సంప్రదాయ బెంగాళీ అమ్మాయిలా కనిపిస్తోంది. ఎరుపు, తెలుగు రంగులు కలబోసిన ఈ కాటన్‌ శారీ పల్లుపై చిన్న ముత్యాలు కూడా ఉన్నాయి. పల్లు కూడా రెడ్‌, వైట్‌ రంగులో అడ్డుగీతలు కలిగి ఉంది. మీరు ఈ శారీకి మరింత లుక్‌ అందించాలంటే దీనిపై కాంట్రాస్ట్‌ బ్లౌజ్‌ లేదా ప్రింటెడ్‌ కూడా ధరించవచ్చు.

5 /7

సిక్వెన్డ్‌ బ్లాక్‌ గోల్డ్‌ శారీ.. ఈ శారీ చూడటానికి షిమ్మర్‌ లుక్‌ అందిస్తోంది. నలుపు, బంగారు వర్ణంలో ఉన్న  ఈ చీర  రెట్రో వైబ్‌ కూడా ఇస్తుంది. ప్లెయిన్‌ బ్లాక్‌ పై గోల్డెన్‌ సీక్వెన్స్‌ చీర మొత్తం వచ్చింది. ఈ సన్నని చీరకు బార్డర్‌ ఆకుల ఆకృతి, ముత్యాలతోపాటు బార్డర్‌ కూడా ఎర్ర రంగులో లైనింగ్‌ ఇచ్చారు.

6 /7

బ్లూ బనారసీ.. మీరు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలనుకుంటే రాయల్‌ లుక్‌లో కనిపించాలంటే శోభిత ధూళిపాళ్ల ధరించిన ఈ శారీ బాగుంటుంది. ఈ రాయల్‌ బ్లూ బనారసీ సిల్క్‌ శారీ ప్లెయిన్‌ రంగులో డల్‌ గోల్డెన్‌ జర్రీ వర్క్‌ చీర మొత్తం డిజైన్‌ చేశారు. దీనికి బార్డర్‌ టచ్‌ కూడా ఇచ్చారు.

7 /7

పింక్‌ ఎంబ్రాయిడరీ.. శోభిత ధూళిపాళ్ల రాణి కలర్‌ జార్జెట్‌ బట్టర్‌ ఫ్లై నెట్‌ కాటన్ సిల్క్‌ శారీ ధరించారు. దీనిపై గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ చీర మొత్తం ఉంది.  ఈ శారీ పల్లుపై కూడా గోల్డెన్‌ థ్రెడ్‌ వర్క్‌ కలిగి ఉంది.