Smartphone Hacks: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. వ్యక్తిగత పనుల నుంచి ఆఫీసు పనులు అన్నింటికీ స్మార్ట్‌ఫోన్. అందుకే ఇప్పుడు వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ప్రోసెసర్ పవర్ ఫుల్‌గా ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ లేదా వినియోగం పెరిగే కొద్దీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుంటుంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఫోన్ హ్యాంగ్ కాకుండా చేయడమే కాకుండా పనితీరు మెరుగుపర్చవచ్చు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చాలామంది ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పట్టించుకోరు. అలాగే వాడేస్తుంటారు. ఫోన్ పనితీరు వేగంగా ఉండాలంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. కొత్త ఆప్‌డేట్స్ పరిశీలిస్తుండాలి.
ఫోన్ మెమరీ క్లియర్ చేయడం ఫోన్‌లో ఉండే అనవసరపు ఫైల్స్ తొలగిస్తుండాలి. గూగుల్ ఫైల్స్ యాప్ ఉపయోగించవచ్చు. దాంతోపాటు ఫోటో, వీడియో , ఇతర మెమరీలను క్లౌడ్‌లో సేవ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫోన్ మెమరీ క్లీన్ చేసుకోవాలి.
ఏనిమేషన్ తగ్గించడం మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఏనిమేషన్ తగ్గించండి. ఇలా చేస్తే ఫోన్ పనితీరు కొద్గిగా వేగవంతమవుతుంది. ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల ఒక్కోసారి హీటెక్కుతుంది. ఇలాంటప్పుడు కాస్సేపు ఫోన్ వాడటం మానేయాలి
యాప్స్ తగ్గించడం మీరు వినియోగించని యాప్స్ ఫోన్‌లో ఉంటే వాటిని తొలగించండి. హోమ్ స్క్రీన్‌పై ఎక్కువ యాప్స్ ఉంచవద్దు. దీనివల్ల ఫోన్ పనితీరు మందగిస్తుంది. తక్కువగా ఉపయోగించే యాప్స్‌ను క్లోజ్ చేయడం మంచిది.
స్మార్ట్‌ఫోన్ రీస్టార్ట్ చేయడం మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతుంటే సహజంగానే పనితీరు మందగిస్తుంది. ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది. ఈ సమస్య ఎదురైనప్పుడు రీస్టార్ట్ చేయాలి. ఇలా చేస్తే ఫోన్‌లో ఉన్న మెమరీ ఫ్రీ అవుతుంది. పని తీరు వేగవంతమౌతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే యాప్స్ కారణంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంటుంది.