Raksha Bandhan 2024 Timings: సోదరులకు రాఖీ కడుతున్నారా..ఈ టైంలో మాత్రం అసలు కట్టకండి..!

Raksha Bandhan Timings: ఆగస్టు 19 అనగా సోమవారం రోజున రక్షాబంధనం జరుపుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో భద్ర కాలం ఉదయం 5: 53 గంటల నుండి మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుందని శాస్త్ర ప్రకారం ఈ సమయంలో రక్షాబంధనం జరుపుకోకూడదని పండితులు చెబుతున్నారు. 
 

1 /5

ఎప్పటిలాగే ఈసారి కూడా ఆగస్టు 19 (సోమవారం) వ తేదీన శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకోబోతున్నారు.  అయితే పండితులు కొన్ని సమయాలను తప్పకుండా పాటించాలని,  ఆ సమయాలలో మాత్రమే  తమ సోదరులకు రాఖీ కట్టాలని సోదరీమణులకు సూచిస్తున్నారు. మరి ఆగస్టు 19 వ  తేదీన ఏ ముహూర్తంలో రక్షాబంధన్ కట్టాలో ఇప్పుడు చూద్దాం. 

2 /5

ఆగస్టు 19 వ తేదీన రక్షా పూర్ణిమ జరుపుకోనున్నారు. పౌర్ణమి తిథి ఆరోజు తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమై రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ మధ్యలో భద్రకాలం ఉదయం 5: 53 గంటల నుండి మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుందని శాస్త్ర ప్రకారం ఈ భద్రకాలంలో సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని పండితులు చెబుతున్నారు. అది ముగిశాక మధ్యాహ్నం 1:33 గంటల నుండి  రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయం ఉంటుందని,  ఆ సమయంలో రాఖీ కట్టాలని పండితులు సూచిస్తున్నారు. 

3 /5

రక్షాబంధన్ లేక రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పూర్ణిమ లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నా చెల్లెలు,  అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్న లేదా తమ్ముడికి ప్రేమ సూచకంగా సోదరి కట్టే ఒక పట్టిని రాఖీ అని పిలుస్తారు.  

4 /5

రాఖీ అనగా రక్షణ బంధం.. అన్నా చెల్లెలు,  అక్క తమ్ముళ్లు జరుపుకునే ఈ మహోత్తరమైన పండుగ.. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేది ఈ రాఖి. అంతేకాదు  జంధ్యాన్ని ధరించి వారు కూడా ఈరోజునే పాతది వదిలి కొత్తదానిని ధరిస్తారట. ఉపనయనం అయిన వారు ఈ జంధ్యాల పౌర్ణమి రోజున గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది వదిలేస్తారు.

5 /5

పురాణాల ప్రకారం ద్రౌపది , శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన  చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంటే, అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టు కట్టిందట. దానిని కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇచ్చాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు  దురాగతము నుండి ఆమెను సంరక్షించారు.