Business Ideas: రూపాయి ఇన్వెస్ట్‌మెంట్‌ లేకుండా ఈ వ్యాపారాలు ప్రారంభించండి.. భారీ లాభాలు మీ సొంతం..!

Business Ideas in Telugu: బిజినెస్ ప్రారంభించాలంటే ఎంతో కొంత చేతిలో డబ్బులు ఉండాలి. అయితే కొన్ని వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎలాండి డబ్బులు అవసరం లేదు. మీరు ఉద్యోగం చేస్తూ కూడా అదనపు ఆదాయం పొందొచ్చు. ఆ వ్యాపారాల గురించి ఇక్కడ తెలుసుకోండి. 
 

  • Sep 08, 2023, 23:26 PM IST
1 /5

Fiverr అనే ప్లాట్‌ఫారమ్‌ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీ స్కిల్స్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. చాలా మంది సక్సెస్ స్టోరీలను ఇక్కడ షేర్ చేస్తూ.. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.  

2 /5

యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్. 230 మిలియన్లకు పైగా వినియోగదారులు యూట్యూబ్‌ని ఉపయోగిస్తున్నారు. మీరు యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ.. డబ్బులు సంపాదించవచ్చు. మీరు మొబైల్ లేదా డెస్క్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ కలిగి ఉంటేచాలు. మీరు ఒక విషయంపై యూట్యూబ్ ఛానెల్‌ని ఓపెన్ చేసి.. మంచిగా ప్రమోట్ చేసుకుంటే ఆదాయం వస్తుంది.   

3 /5

మీ ఇంటి వద్ద మీ వాహనం ఇంటి వద్ద ఖాళీగా ఉంచే బదులుగా అద్దెకు ఇచ్చి ఆదాయం సంపాదించుకోవచ్చు. మీ వాహనాన్ని Tuoro వంటి కంపెనీకి అద్దెకు ఇవ్వవచ్చు.  OLA, UBER వంటి కంపెనీలలో కూడా మంచి ఆదాయం వస్తుంది. 

4 /5

మీ వద్ద క్రియేటివిటీ ఉంటే.. మంచి డిజైన్ల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. 99designs, Creative Market, ThemeForest మొదలైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆదాయం పొందొంచ్చు. మీ డిజైన్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు.  

5 /5

మీకు వృత్తిపరమైన స్కిల్స్‌ లేకపోయినా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే డేటా ఎంట్రీ  ద్వారా ఆదాయం పొందొచ్చు. కంపెనీలు గంట ప్రాతిపదికన చెల్లిస్తాయి. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ సంపాదిస్తారు. దీని కోసం మీరు ఆన్‌లైన్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోర్టల్ ద్వారా డేటా ఎంట్రీ వర్క్‌ను వెతుక్కుంటే సరిపోతుంది.