Baby bump photoshoot: చైనాలో ఇటీవల కాలంలో అమ్మాయిలు కాస్తంత వెరైటీగా ఆలోచిస్తున్నారంట. దీంతో ఇటీవల చైనాలోని సౌత్ మార్నింగ్ పోస్ట్ ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తొంద. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
పెళ్లి అనేది జీవితంలో ఒక గొప్పదైన అనుభూతి అని చెప్తుంటారు. అందుకే చాలా మంది పెళ్లికి ఎంతైన ఖర్చు చేస్తుంటారు. పెళ్లి కోసం ప్రీవెడ్డిండ్ షూట్ నుంచి ప్రతి ఒక్క ప్రొగ్రామ్ కూడా ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు.
అదే విధంగా పెళ్లి వేడుకకు ఖర్చు ఎంతైన చేసేందుకు అస్సలు వెనుకాడరు. పెళ్లి తర్వాత చాలా మంది మహిళలు తల్లికావాలని తాపత్రయ పడుతుంటారు. ఇటీవల బేబీ బంప్ తో ఫోటో షూట్ చేయడం కూడా ట్రెండింగ్ గా మారింది.
కొంత మంది హీరోయిన్ లు కూడా.. ఇటీవల ప్రెగ్నెంట్ అయ్యాక కూడా.. ఫోటోషూట్ లతో నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. తాజాగా.. చైనాలో అమ్మాయిలు మాత్రం వింత పోకడలకు పోతున్నారంట.
పెళ్లికి ముందే ఫోటోషూట్ లో హల్ చల్ చేస్తున్నారు. ఇటీవల దీనిపై చైనాలో ఒక ఫెమస్ వార్త పత్రికలో కథనం ప్రచురితమైనట్లు తెలుస్తొంది. అక్కడి అమ్మాయిలు.. పెళ్లి తర్వాత నిజమైన ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు.. వారికి అనేక రకాల హెల్త్ సమస్యలు వస్తాయని అనుకుంటున్నారంట.
దీంతో ఫోటో షూట్ సరిగ్గారాదని అనుకుని.. పెళ్లికి ముందే ఆర్టిఫిషియల్ గా.. ఫోటోషూట్ దిగుతున్నారంట. దీంతో ఈ విషయం తెలిసిన వారు మాత్రం షాక్ అవుతున్నారంట. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఘటన కాస్త వైరల్ గా మారింది.
ఇక ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తొంది. ఇలా పెళ్లికి ముందే అమ్మాయిలు.. మహిళలు..ఇలా చేస్తే.. ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని వింతలు చూడాలో అంటూ కొంత మంది ఆందోళన చెందుతున్నారంట.