Shruti Haasan: శృతిహాసన్ డబ్బులు లాగేసుకున్న స్టార్ హీరోయిన్..!

Shruti Haasan Remuneration : సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే నటీనటులు ఒక సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత మధ్యలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ పాత్రల నుంచి తప్పుకుంటారు. ఆ పాత్రలలో వేరే వారు వచ్చి చేరుతూ ఉంటారు. ఇప్పుడు డెకాయిట్ విషయంలో కూడా ఇదే జరిగిందని చెప్పవచ్చు.

1 /5

సాధారణంగా ఒక దర్శకుడు సినిమా కథను రూపొందించేటప్పుడు.. ఫలానా పాత్రకు ఫలానా హీరో లేదా హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా వారిని దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రలను డిజైన్ చేస్తారు. అందుకు తగ్గట్టుగానే సినిమా తెరపైకి వచ్చినా.. తర్వాత చిన్నపాటి విభేదాలు ఏర్పడితే మాత్రం ఆ సెలబ్రిటీలు ఆ పాత్రల నుంచి తప్పుకుంటారు..అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే శృతిహాసన్ తన పాత్ర నుంచి తప్పుకోవడంతో.. మృనాల్ ఠాకూర్ ఆ పాత్రను భర్తీ చేసింది. 

2 /5

అసలు విషయంలోకి వెళితే.. యంగ్ హీరో అడివి శేష్ తాజాగా తెలుగులో నటిస్తున్న చిత్రం డెకాయిట్. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోందని మొదట్లో చెప్పాడు. అయితే ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ముఖ్యంగా చిత్రం మేకర్స్ తో శృతిహాసన్ కి చిన్న విభేదాలు వచ్చాయని, అందుకే ఆమె ఈ పాత్ర నుండి వెళ్లిపోయిందని సమాచారం.

3 /5

ఇదిలా ఉండగా శృతిహాసన్ పాత్రలో మృనాల్ ఠాకూర్ ఎంపికైన విషయం తెలిసిందే. జెర్సీ, సూపర్ 30, సీతారామం చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న మృనాల్ ఠాగూర్ ని ఇందులో హీరోయిన్గా తీసుకున్నారట. మృణాల్ కు పాన్ ఇండియా గుర్తింపు ఉంది. కాబట్టే ఈ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. 

4 /5

ఇక ఈ హీరోయిన్ తో పోస్టర్ ని కూడా ఈ మధ్యనే విడుదల చేశారు సినిమా యూనిట్. ఇకపోతే తన స్క్రిప్టులో సహనటుడు ప్రమేయం ఉండడం వల్లే సంతోషంగా లేని శృతిహాసన్.. ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.

5 /5

ఇదిలా ఉండగా శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల శృతికి ఎంతో నష్టం వచ్చింది అని వినికిరి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఈ సినిమా కోసం రూ.2.5 కోట్ల పారితోషకం డిమాండ్ చేసిందని, ఇక మృనాల్ కు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మేకర్స్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.