Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!

Ganesh Nimajjanam Holiday: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్‌.. మంగళవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఈనెల 17వ తేదీ వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నీ స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 

1 /5

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్‌ రంగారెడ్డి, మేడ్చల్‌ మాల్కాజిగిరి జిల్లాల్లోని అన్నీ ప్రభుత్వం కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ అంటే మంగళవారం రోజు సెలవు ప్రకటిస్తూ శుక్రవారం రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  

2 /5

సెప్టెంబర్‌ మాసం వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో రెండో తేదీ కూడా అన్నీ స్కూళ్లు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ తర్వాత వినాయక చవితి 7వ తేదీ కూడా సెలవు, వరుస సెలవుల నేపథ్యంలో నేడు రెండో శనివారం 14వ తేదీ అన్ని విద్యాసంస్థలకు సెలవు రద్దు చేసి పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.  

3 /5

 రేపు ఆదివారం సెలవు, సోమవారం మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా 16వ తేదీ కూడా సాధారణ సెలవు దినంగా పరిగణించారు. తాజాగా 17న మంగళవారం గణేష నిమజ్జనం సందర్భంగా ఆరోజు కూడా ముఖ్యంగా హైదరాబాద్‌లో పనిచేసే అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు దినంగా ఉత్తర్వులు జారీ చేసింది.  

4 /5

అయితే, మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు కూడా 17వ తేదీ జరుపుతారు. కానీ, ఈ ఊరేగింపు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజు మహానిమజ్జనం కూడా ఉంది కాబట్టి, మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు 19వ తేదీ జరగే అవకాశం ఉందని తెలుస్తోంది.  

5 /5

ఈ సెలవు దినం కారణంగా అన్నీ విద్యాసంస్థలకు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఇక బ్యాంకులు కూడా ఈ నెలలో కేవలం 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. విద్యా సంస్థలకు కూడా వరదలు, భారీ వర్షాలు, పండుగల సందర్భంగా సెలవులు వస్తున్నాయి.