Saturn Transit Effect: శనిశ్వరుడు నవగ్రహాలలో ఒకడు. ఈ దేవుడు వ్యక్తులు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. శనిదేవుడు కాలచక్రం, న్యాయం, కర్మ ఫలం, కష్టం, అధికారం వంటి అంశాలకు సూచికగా భావిస్తారు. శని దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో... శని గ్రహానికి కూడా అంతే ప్రముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శని గ్రహం వల్ల ఎన్నో లాభాలు, కష్టాలు కలుగుతాయి.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని గ్రహాం ఏదైనా రాశిలో ప్రవేశించినప్పుడు ఇతర రాశులవారిపైనా తీవ్రమైన ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఒకే రాశిలో శని కొన్ని ఏళ్ల పాటు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం శని గ్రహాం ప్రధాన త్రిభుజ రాశి అయిన కుంభ రాశిలో ప్రవేశించాడు. దీని వల్ల కొన్ని రాశులవారిపైన ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అలాగే ఈ గ్రహం అప్పుడప్పుడు కదలికలు కూడా జరుపుతుంది. దీని కారణంగా కూడా స్పెషల్ ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఈ గ్రహ కదలికతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి
2025 వరకు శనీశ్వరుడు కుంభ రాశిలో ఉంటాడని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తరువాత మీన రాశిలోకి శని గ్రహం ప్రవేశిస్తుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి దీవ్యమైన యోగం కలుగుతుంది. అంతేకాకుండా అదృష్టం ఎల్లప్పుడు వరిస్తుంది.
శని గ్రహాం మీన రాశి ప్రేవేశించడం వల్ల ఎలాంటి యోగం కలుగుతుంది..? ఈ స్వర్ణ యోగాన్ని పొందే రాశులు ఏవి..? ఏ రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాం.
మేషరాశి: శినిదేవుడి ప్రభావం వల్ల ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తిలగిపోతాయి. ఆరోగ్యం పట్లు కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. వైవాహిక జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇష్టదైవార్థన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మిథునం: శని గ్రహం ప్రభావంతో అద్భుతమైన ఫలితాలను అనుభవిస్తారు. ధనవంతులు కావడంతో పాటు అద్భుతమైన యోగాలను పొందుతారు. కుటుంబ సమస్యలతో బాధపడేవారికి త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కరం లభిస్తుంది. సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ భించే అవకాశం ఉంది. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం: ఈ రాశివారు శనిదేవుని అనుగ్రహంతో ఆర్థికంగా చాలా లాభాపడుతారు. సంపద పెరుగుతుంది. వృత్తి , ఉద్యోగాల్లో బోలెడు అవకాశాలు కలుగుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంలో సమయం గడుపుతారు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.