Sankranti Travel To Villages: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న చాలామంది ఊరెళుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై రద్దీ మరింతగా పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు పలు విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేయడంతో నిన్న రాత్రి నుంచి ఊళ్లకు ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు శనివారం వీకెండ్ కాబట్టి మరింత ఈ రద్దీ పెరగనుంది. అయితే, ఊరెళ్లవారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరు వెళ్ళేందుకు రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్షుక్ నగర్ కూకట్పల్లి, ఎస్ ఆర్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో వాహనాలతో కిటకిటలాడాయి. నిన్న రాత్రి కూడా ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు, రేపు కూడా నగరంలో రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
సంక్రాంతి సంబరాలు కోసం హైదరాబాద్ వాసులు ప్రతి ఏటా సొంతూళ్లకు వెళతారు. ఈ ఏడాది కూడా పల్లెలకు బయలుదేరుతున్నారు. పట్నం ఖాళీ అవుతుంది నిన్న రాత్రి జేఎన్టీయూ, కేపిహెచ్బి, ఎస్సార్ నగర్ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు నిలిచిపోయాయి. రైలు, బస్సులు, కారులు ,బైకులు ప్రతి వాహనంలో పల్లె వైపు కదులుతున్నారు.
ఇక నేడు రేపు శనివారం ఆదివారం కావడంతో పట్నం మరింత ఖాళీ అవ్వనుంది. రద్దీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి ఊరు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగలు, నగదు బ్యాంకుల భద్రపరుచుకోవాలని సూచించారు.
అంతేకాదు ఇంటికి తాళం వేసి కనిపించకుండా కర్టెన్ తొడగాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మరింత మంచిది. ఇంట్లో లైట్లు కూడా వేసి వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఊరు వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోదు. ఇంటి ముందు తెలిసిన వారితో చెత్త శుభ్రం చేయించుకోండి. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు 100 కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.
ఒక సంక్రాంతికి ఊర్లకు ప్రయాణించే సొంతవాహలలో ప్రయాణించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరిగా ఎక్కువ శాతం మద్యం తాగి ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అతివేగం విశ్రాంతి లేకుండా వాహనం నడవటం వల్లే 80% ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డుపై ఆక్సిడెంట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిసింది.