Sanjjanaa Galrani shocking comments: సంజన గల్రానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. దీంతో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి చర్చలలో నిలిచింది.
ఇండస్ట్రీలో తరచుగా మహిళలు ఎక్కువగా వేధింపులకు గురౌతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. అవకాశాలు రావాలంటే.. ఖచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అని కొంత మంది వేధిస్తుంటారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. తరచుగా మనం చూస్తునే ఉంటాం.
ఈ నేపథ్యంలో కేరళ సర్కారు మళయాల చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై హేమకమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రిపోర్టులో అనేక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది తమకు జరిగిన అన్యాయాలను బహిరంగంగానే కమిటీ ముందు చెప్పుకున్నారు.
గతంలో మీటూ ఉద్యమం దేశంలో పెనుసంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. కన్నడ భామ.. సంజన గల్రానీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. తనను ఒక హీరో పాట షూటింగ్ సమయంలో నీచంగా ప్రవర్తించాడని ఈ భామ చెప్పారు.
ఒక పాట చిత్రీ కరణ సమయంలో.. డైరెక్టర్ తో ఆ హీరోకు ఏదో గొడవ జరిగిందని.. దీంతో అతగాడు.. తన దగ్గరకు వచ్చి.. తన భూజాలను గట్టిగా పిసికేశాడని చెప్పింది. దీంతో చాలా సేపు షాక్ లో ఉండిపోయానని చెప్పారు. ఏంటీదని కోపంలో ప్రశ్నించగా.. అదేదో.. పోకిరీ సినిమాలో డైలాగ్ లాగా.. గిల్లితే గిల్లించుకొవాలన్నట్లు.. మెనెజ్ చేసుకొ అన్నాడని నటి చెప్పింది.
ఆ కన్నడ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నటి ఇష్టపడలేదు. మరొవైపు ఈ నటి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో మరోసారి కాస్టింగ్ కౌచ్ వివాదానికి తెరమీదకు తీసుకొచ్చాయి. అయితే.. సంజన గల్రానీ.. 2005 లో రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా సొగ్గాడు మూవీలో నటించారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా బుజ్జీగాడు లో.. సంజన గల్రానీకి మంచి బ్రేక్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఆ తర్వాత కంటీన్యూగా.. పోలీస్ పోలీసు, సత్యమేవ జయతే, దుశ్యాసన, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ లో నటించారు. ఈ భామ.. అజీజ్ పాషా అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు.