Bank Recruitment 2025: రూ.48 వేల జీతంతో బ్యాంకు ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? జాబ్ కొట్టడానికి ఇదే మంచి ఛాన్స్..


Bank Recruitment 2025 Recruitment: యూకో బ్యాంక్ నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఉద్యోగ అర్హతలను, జీతం వివరాలను క్లుప్తంగా వెల్లడించారు. అయితే మీరు కూడా ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? పూర్తి దాకా చదవండి..

 

Bank Recruitment 2025 Recruitment: ప్రముఖ యూకో బ్యాంక్ నుంచి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ఈ బ్యాంకుకు సంబంధించిన వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా లోకల్ బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ అనే ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 /5

ఈ నోటిఫికేషన్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 11 రాష్ట్రాల్లో ఉన్న యూకో బ్యాంక్ (UCO Bank)లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించారు.     

2 /5

అలాగే ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్లు ప్రత్యేకంగా విద్యార్హతను కూడా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా ఏదో ఒక డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా అప్లై చేసుకునే ప్రదేశంలో గల భాషను మాట్లాడగలగాలి.    

3 /5

అలాగే ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జీతం వివరాలను కూడా వెల్లడించారు. ఇందులో ఎంపికైన వారికి యూకో బ్యాంక్ (UCO Bank) రూ.48,480 నుంచి ఎక్స్పీరియన్స్‌ను బట్టి జీతం చెల్లించబోతున్నట్లు తెలిపింది.     

4 /5

ఈ బ్యాంకు ఉద్యోగాల్లో భాగంగా వయస్సు పరిమితిని కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. అంతేకాకుండా వయస్సులో సడలింపులను కూడా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయస్సు సడలింపులను చేశారు.     

5 /5

ఈ ఉద్యోగానికి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాన్ని అప్లై చేసిన వారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారని నోటిఫికేషన్ లో తెలిపారు.