Saif Ali khan Properties: బాలీవుడ్ నటుడు సైఫ్ పై చోరికి వచ్చిన వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో తెల్లవారుజామున ఒక్కసారిగా పెనుగులాట సంభవించింది. సైఫ్ అరుపులతో ఆయన కొడుకు బెడ్ రూమ్ నుంచి బైటకు వచ్చాడు.
సైఫ్ అలీఖాన్ ఇంట్లో దుండగులు ప్రవేశించి.. సైఫ్ పై దాడికి యత్నించారు. కత్తిపొట్లకు కారణమయ్యారు. దీంతో సైఫ్ ను ఆయన కుమారుడు ఆస్సత్రికి తరలించాడు. సైఫ్ కు మొత్తంగా ఆరు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. లీలావతి ఆస్పత్రి వైద్యులు రెండు సర్జరీలు నిర్వహించి.. కత్తి ముక్కను బైటకు తీసినట్లు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సైఫ్ ఆస్తులు అంశం తెర మీదకు వచ్చింది. సైఫ్ అలీఖాన్.. బాలీవుడ్ లో అత్యంత సంపన్న హీరోలలో ఒకరు. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృతా సింగ్ .. సైఫ్ పెళ్లి చేసుకున్నారు.. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం.
ఆ తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో.. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత కొన్నేళ్ల పాటు సింగిల్ గానే సైఫ్ ఉన్నారు. ఈ క్రమంలో.. 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం .. సైఫ్ నికర విలువ $150 మిలియన్లుగా లేదా ₹ 1200 కోట్లకు పైగా ఉంది. ఇది షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ ల తర్వాత అత్యంత ధనవంతులలో సైఫ్ ఒకరిగా నిలిచాడు.
సైఫ్ పటౌడీ వంశానికి చెందిన వారు. వీరికి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉంది. దీని ధర ₹ 800 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తొంది. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటి.
ఇది దాదాపు.. 10 ఎకరాలలో విస్తరించి ఉంది. ముంబై, ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్, రాజస్థాన్ , బెంగళూరు వంటి ప్రాంతాల్లో సైఫ్ కు భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఆయన సతీమణి కరీనా కపూర్ పేరిట కూడా భారీగానే ఆస్తులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.