Revanth Reddy Chandiyagam Photos: కూతురు, అల్లుడితో రేవంత్ రెడ్డి చండీయాగం పూజ ఫోటోలు వైరల్

Revanth Reddy Chandiyagam Photos: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లోని తన నివాసంలో చండీయాగం నిర్వహించారు. రేవంత్ రెడ్డి దంపతులు నిర్వహించిన ఈ చండీయాగానికి ఆయన సమీప బంధుమిత్రులు, పార్టీ నేతలు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Revanth Reddy Chandiyagam Photos: చండీయాగం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని అన్నారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

1 /5

Revanth Reddy Chandiyagam Photos: చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో సమాన స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నట్టు రేవంత్ రెడ్డి తన ఆకాంక్షను వ్యక్తపరిచారు.

2 /5

Revanth Reddy Chandiyagam Photos: కొడంగల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.  

3 /5

Revanth Reddy Chandiyagam Photos: తెలంగాణలో ప్రజా రంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నానని.. చండీయాగంతో రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి  సిద్దించాలి అని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

4 /5

Revanth Reddy Chandiyagam Photos: తెలంగాణలో ప్రజా రంజకమైన పాలన రావాలని కోరుకుంటున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి... తెలంగాణకు మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

5 /5

Revanth Reddy Chandiyagam Photos: కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. భవిష్యత్ లో కూడా కొడంగల్ ప్రజల ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.