Blue Tea: ఈ పూల టీతో బరువు తగ్గడమే కాదు.. తీవ్ర వ్యాధులకు కూడా చెక్‌ పెట్టొచ్చు!

Blue Tea For Chronical Diseases: శంకు పూల టీలో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 

  • Sep 28, 2023, 13:55 PM IST


Blue Tea For Chronical Diseases: శంకు పూల టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ టీలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 
 

1 /5

శంకు పూల టీలో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రించేందుకు కూడా సహాయపడతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా దోహదపడుతుంది.   

2 /5

ప్రస్తుతం చాలా మంది గ్రీన్‌ టీలను ఎక్కువగా తాగుతున్నారు. అయితే దీనికి బదులుగా బ్లూ టీ తాగమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభావంతంగా సహాయపడుతుంది. 

3 /5

శంకు పూల టీలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను ప్రభావంతంగా కరిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

4 /5

ఈ బ్లూ టీ మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు ఈటీని రెండు గ్లాసుల చొప్పున తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 

5 /5

ఈ టీలో ఉండే గుణాలు ఒత్తిని నియంత్రించి మైండ్‌ను రిలాక్స్‌ చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బ్లూ టీని ప్రతి రోజు తాగితే గుండెతో పాటు మెదడు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.