Actress pavithra gowda: కన్నడ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి పవిత్ర గౌడ అరెస్టు..

Renuka swami Murder case: కన్నడ నటుడు దర్శన్ ను పోలీసులు ఈరోజు మైసూర్ ఫామ్ హోస్ నుంచి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆమె ప్రియురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

1 /6

కర్ణాటకలో సినిమా ఇండస్డ్రీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కన్నడ నటుడు దర్శన్ ను, రేణుక స్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇతనికి నటి పవిత్ర గౌడకు ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, నటి పవిత్ర గౌడకు ఇది వరకు పెళ్లైంది. 

2 /6

నటి పవిత్ర గౌడకు కొన్ని రోజులుగా రేణుక స్వామి అనే వ్యక్తి వాట్సాప్ లో అసభ్య కరమెస్సెజ్ లు పంపిస్తున్నట్లు ఆమె దర్శన్ కు చెప్పింది. దీంతో అతగాడు.. రేణుక స్వామి మర్డర్ కోసం ప్లాన్ చేశారు. 

3 /6

బెంగళూరులో స్పెషల్ గా సుపారీ గ్యాంగ్ తో అతగాడికి హత్య చేయించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని డెడ్ బాడీ ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో నటుడు దర్శన్ పాత్ర అంతా బైటపడింది. 

4 /6

పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించి, నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో దర్శన్, నటి పవిత్ర పేర్లు బైటపడ్డాయి. అయితే.. ఇది వరకు నటుడు దర్శన్ ను అరెస్టు చేసిన పోలీసులు,తాజాగా నటి పవిత్ర గౌడను కూడా అరెస్టు చేశారు.

5 /6

కన్నడ నటి పవిత్ర గౌడను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రముఖ కన్నడ హీరో దర్శన్‌ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇక ఆమెకు అసభ్యకర సందేశాలు పంపిన రేణుకా స్వామి అనే వ్యక్తి జూన్ 8న హత్యకు గురయ్యాడు. 

6 /6

హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు పోలీసుల విచారణలో దర్శన్ పేరు చెప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న సినీ హీరో దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. .ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలంగా మారింది.