Renudesai perform ganapathi homam: పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
రేణు దేశాయ్ ఇటీవల మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు మూవీలో నటించారు. ఆ మూవీలో రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రలో కన్పించనున్నారు. తాజాగా, ఆమె రేణు దేశాయ్.. ఇంట్లో గణపతి, చండీ హోమం నిర్వహించారు.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల సనాతన ధర్మం కాపాడుకొవాలని అనేక సందర్భాలలో ఎమోషనల్ అవుతున్నారు. ఈక్రమంలో మన హిందు ధర్మం ఆచారాలు, సంప్రదాయాలు కాపాడుకొవాలంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం విషయంలో చేసిన కామెంట్ లు దేశంలో పెద్ద చర్చకు దారితీశాయి. అంతే కాకుండా. పవన్ వారాహి అమ్మవారిని ఆరాధించడం, దుర్గామాత దగ్గర ప్రాయిశ్చిత్త పూజలు నిర్వహించడం, తిరుమలకు వెళ్లడం చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్య కూడా పవన్ కళ్యాన్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. శరత్ పూర్ణిమ నేపథ్యంలో.. రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రేణు దేశాయ్ తన ఇన్ స్టాలో గణపతి, చండీ హోమానికి చెందిన వీడియోను షేర్ చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు తమ ధర్మం, ఆచార సంప్రదాయాల గురించి చిన్నతనం నుంచి చెప్పాలన్నారు. దీని వల్ల మన పూజలు, పద్దతుల గురించి వారికి కూడా అవగాహాన ఉంటున్నారు.
మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మం అంటూ వార్తలలో నిలిచారు. ఇప్పుడు పవన్ మాజీ సతీమణి.. ఈ విధంగా గణపతి , చండీ హోమం చేయడాన్ని మాత్రం కొంత మంది.. పవన్ ను రేణు దేశాయ్ ఫాలొ అవుతున్నారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.