Ravichandran Ashwin Net Worth: క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్తులు ఎంతో తెలుసా..లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.ఇంకా ఎన్నో

Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ క్రికెటర్  రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  గబ్బా టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్ లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ క్రికెట్ ద్వారా బాగానే సంపాదించుకున్నాడు. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న అశ్విన్ ఐపీఎల్, ప్రకటనల తర్వాత భారీగానే ఆస్తులను కూడా బెట్టుకున్నాడు. 
 

1 /6

Ravichandran Ashwin Net Worth: భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గాబ్యా టెస్ట్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని  వెల్లడించాడు. అడిలైడ్ డే నైట్ టెస్టులో అతను టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. 38 ఏళ్ల స్పిన్నర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ స్థాయి పెరగడంతో, అతని సంపాదన కూడా అదే స్థాయిలో పెరిగింది. టీమిండియా తరపున టెస్టుల్లో 500లకు పైగా వికెట్లు తీశాడు. క్రికెట్ మైదానంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అశ్విన్..సంపాదనలోనూ ఏమాత్రం తగ్గలేదు. అశ్విన్ మొత్తం సంపద 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఆస్తి విలువ మొత్తం 132 కోట్లు.   

2 /6

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) నుండి వచ్చే జీతం, IPL కాంట్రాక్ట్‌లు, యాడ్స్  ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంది. స్పిన్నర్ అశ్విన్ బీసీసీఐ గ్రేడ్ ఎలో భాగం కావడంతో ఆయన  రూ.5 కోట్లు అందుకుంటాడు. ఐపీఎల్ 2022 నుంచి అశ్విన్ రాజస్థాన్ రాయల్స్‌లో భాగంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఫ్రాంచైజీ అతనికి రూ.5 కోట్లు చెల్లించేది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది.   

3 /6

అశ్విన్ యాడ్స్  ద్వారా కూడా మంచి ఆదాయాన్ని కూడబెట్టుకుంటున్నాడు.  వీటిలో మైంత్రా, బాంబే షేవింగ్ కంపెనీ, మన్నా ఫుడ్స్, అరిస్టోక్రాట్ బ్యాగ్‌లు, ఒప్పో, మూవ్, స్పెక్స్‌మేకర్స్, జూమ్‌కార్, కోకో స్టూడియో తమిళ్,  డ్రీమ్ 11 ఉన్నాయి. ఇవే కాకుండా అశ్విన్‌కు చెన్నైలో దాదాపు రూ.9 కోట్ల విలువైన పెద్ద బంగ్లా ఉంది.   

4 /6

1986 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించిన అశ్విన్ కు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. అతని వద్ద లగ్జరీ బ్రాండ్ కార్లు ఉణ్నాయి. ఆడిక్యూ 7 ఎస్ యూవీ, రూల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. వీటి ధర దాదాపు 6కోట్లు ఉంటుంది.   

5 /6

ఇక రవిచంద్ర అశ్విన్  106 టెస్టుల్లో 24.00 సగటుతో 537 వికెట్లు, 2.83 ఎకానమీతో తీశాడు. టెస్టుల్లో 37 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు తీశాడు. టెస్టులో 3503 పరుగులు కూడా చేశాడు.  

6 /6

ఈ ఫార్మాట్‌లో అతని పేరు మీద 14 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. 116 వన్డేల్లో 156 ఔట్‌లు సాధించాడు. వన్డేల్లో అశ్విన్ 1 హాఫ్ సెంచరీ సాయంతో 707 పరుగులు చేశాడు. ఇది కాకుండా అశ్విన్ 65 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 72 వికెట్లు తీశాడు.