Anchor Vishnu Priya Marriage: యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని.. బిగ్‌బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది విష్ణు ప్రియ. టైటిల్ రేసులో కచ్చితంగా ఉంటుందని అందరూ అనుకోగా.. అనుకోకుండా 14వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో పృథ్వీరాజ్‌తో ప్రేమయాణం విష్ణు ప్రియకు నెగిటివిటీ తీసుకువచ్చింది. దీంతో ఫైనల్‌కు చేరుకోకుండానే వెనక్కి వచ్చింది. ఇక తాజాగా ఈ అమ్మడు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
గతంలో పెళ్లి వార్తలపై విష్ణు ప్రియ ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. “నన్ను నమ్మండి.. వచ్చే ఏడాది ఈ సమయానికి నేను ఒంటరిగా ఉండను” అంటూ ఆమె ఇటీవల చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
నవంబర్ 11 సింగిల్స్ డే సందర్భంగా విష్ణుప్రియ స్పందిస్తూ.. వచ్చే ఏడాది ఈ సమయానికి తాను సింగిల్‌గా ఉండనని.. కానీ సింగిల్‌గా ఉండడమే గొప్పగా ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ బజ్‌లో విష్ణు ప్రియ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
హౌస్‌లో తనకు పృథ్వీ బెటర్‌గా అనిపించిందని.. అందుకే కనెక్ట్ అయ్యాయని చెప్పింది. బయట అలాంటి అబ్బాయి కనిపిస్తే.. డేట్ చేసి పెళ్లి చేసుకుంటానని ఓపెన్‌గానే తన మనసులోని మాట చెప్పింది.
పృథ్వీతో ఈ హాట్ బ్యూటీ మ్యాటర్ పెళ్లి వరకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. పృథ్వీ తల్లి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విష్ణు ప్రియ తన కూతురులాంటిదని చెప్పింది.
ఈ కామెంట్స్‌కు రిప్లై ఇస్తూ.. పెళ్లైన తరువాత కోడలిని కూతురిలా చూసుకుంటారంటూ పాజిటివ్‌గా తీసుకుని.. ఇండైరెక్ట్‌గా పెళ్లికి సై అని చెప్పేసింది.