Rashmika Mandanna: గ్లామర్ డోస్ పెంచేసిన రష్మిక…ఈసారి ఏకంగా అలాంటి డ్రెస్సులో..!

Rashmika Glamorous Look : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాని ఏలుతున్న హీరోయిన్ ఎవరంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు రష్మిక మందన్న. వరస హిట్లు కొడుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో సినిమాలతోనే కాకుండా తన మోదరన్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఒక మ్యాగజైన్ కి రష్మిక ఇచ్చిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.  

1 /6

పుష్ప సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ తో పాన్ ఇండియా విజయం అందుకున్న హీరోయిన్ రష్మిక. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ హీరోయిన్.. ఆ తరువాత తన మాతృభాష కన్నా కూడా తెలుగులోనే ఎన్నో విజయాలను సంపాదించుకుంది.  

2 /6

ముఖ్యంగా విజయ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా రష్మికకు మంచి విజయం అందించింది. ఇక అప్పటినుంచి.. తన మకం తెలుగు సినిమాలకే మార్చేసింది. ముఖ్యంగా తెలుగు దర్శకుడు సుకుమార్ తో ఈ హీరోయిన్ చేసిన పుష్ప సినిమా ఈమెకు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చిపెట్టింది.  

3 /6

ఇక ఆ తరువాత కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డివంగాతో.. రష్మిక చేసిన యానిమల్ చిత్రం ఆమెకు హిందీలో మరో విజయం అందించింది. ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో కనిపించి.. తన నటనకు మరిన్ని మార్పులు వేసుకుంది ఈ హీరోయిన్.  

4 /6

కాగా పుష్ప మొదటి భాగంలో రష్మికాకి చెప్పుకోదగ్గ పాత్ర లేకపోయినా.. ఇప్పుడు వచ్చిన రెండో భాగంలో శ్రీవల్లి క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ కావడంతో.. మరిన్ని మార్కులు వేసుకొని.. పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతోంది.  

5 /6

ఇక త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ అని హీరోయిన్ ఓరియంటడ్ చిత్రంలో కూడా కనిపించనుంది. చి.లా.సౌ..లాంటి క్లాసిక్ సినిమా తీసిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావటంతో.. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ తో న్యూ ఇయర్ చేస్తుంది అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.  

6 /6

ఈ క్రమంలో రష్మిక కాస్మోపోలిటన్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటోలు కాస్త తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాగజైన్ ఫోటోలలో మరింత గ్లామర్ పెంచి.. ఎప్పుడూ చూడనంత మోదరన్ డ్రస్సుల్లో కనిపిస్తూ.. రష్మిక అభిమానులను ఆకట్టుకుంటుంది.