Vijay Devarakonda Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న. అయితే ఈమె గీత గోవిందం సినిమా సమయం నుంచి ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడింది అనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే తాజాగా ఈయన చేస్తున్న పనులు చూస్తే నిజంగానే ఆ ఇంటికి కోడలు కాబోతోంది అని సమాచారం.
గత రెండు, మూడు సంవత్సరాలుగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా కలిసి పలు వెకేషన్స్ కి వెళ్లడంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.
దీనికి తోడు ఇటీవల రష్మిక నేను ఎవరిని ఇష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు అంటూ పుష్ప సినిమా ఈవెంట్లో కామెంట్ చేసింది. అలాగే అటు విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం నేను మీరు సింగల్ గా ఉన్నానని అనుకుంటున్నారా? అంటూ కూడా ప్రశ్నించారు. ఇక దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ అర్థమయిపోయింది.
ఇదిలా ఉండగా తాజాగా రష్మిక చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప -2. ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది హీరోయిన్ రష్మిక. ఇదిలా ఉండగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసింది.
హైదరాబాదులో మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మాల్ లో విజయ్ దేవరకొండ తల్లితో పాటు ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి రష్మిక ఈ సినిమా చూడడం జరిగింది. ఇకపోతే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య వచ్చే పీలింగ్స్ పాట లో రష్మిక కాస్త శృతిమించి నటించింది. ముఖ్యంగా వీరిద్దరూ ఈ పాటలో చాలా రొమాంటిక్గా కనిపించారు.
అసలే కాబోయే అత్తగారి పక్కన ఇలాంటి సన్నివేశాలు దీనికి తోడు ఇంకొక వ్యక్తితో రొమాన్స్ అంటే ఇక ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే రష్మిక కాబోయే అత్తతో ఇలాంటి సన్నివేశాలు చూసిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు మరి అత్తగారి రియాక్షన్ ఏంటో చూడాలి అంటూ కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.