Rashmika Mandanna: రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ కలిసొచ్చేనా... పుష్ప 2 హిట్ అంటున్న క్రష్మిక ఫ్యాన్స్..

Rashmika Mandanna December Sentiment: సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు నిలయం. ఇక్కడ తుమ్మినా.. దగ్గినా అన్ని సెంటిమెంట్స్ గానే భావిస్తారు. తాజాగా నేషనల్ క్రష్ క్రిష్మికకు సారీ సారీ రష్మిక కు అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదే డిసెంబర్ సెంటిమెంట్ ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా చిత్రాలు విజయవంతం కావడంతో తాజాగా ఈ నెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్ప 2కు ఈ సెంటిమెంట్ కలిసొస్తోందని అభిమానులు భావిస్తున్నారు.

1 /6

Rashmika Mandanna December: ప్రస్తుతం మన దేశంలో అస‌లు సిస‌లు  ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్  రష్మిక మందన్న అనే చెప్పాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తొలి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ‘యానిమల్’ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. ఇపుడు రాబోయే పుష్ప2తో మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడానికి రెడీ అవుతోంది. ఈ మూడు సినిమాలకు ఓ లింక్ ఉంది.

2 /6

అవును రష్మికకు డిసెంబర్ నెలతో ఓ అవినాభావ సంబంధం ఉంది. ఆమె కథానాయికగా నటించిన కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ మూవీ డిసెంబర్ నెలలో విడుదలైన సంచలన విజయం సాధించడంతో పాటు ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది.  

3 /6

ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో చేసిన ‘అంజనీపుత్ర’ మూవీతో పాటు ఛమక్ అనే సినిమాలు కూడా డిసెంబర్ నెలలో విడుదలై రష్మిక క్రేజ్ ను అమాంతం పెంచేసాయి.  

4 /6

అటు పుష్ప  ది రైజ్ పార్ట్ 1, యానిమల్ చిత్రాలు కూడా డిసెంబర్ నెలలో విడదలై సంచలన విజయాలు నమోదు చేయడంతో పాటు రష్మికను నేషనల్ స్టార్ ను చేసాయి.

5 /6

తాజాగా ఈ నెల 5న విడుదల కాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ మూవీ కూడా ఇదే డిసెంబర్ నెలలో విడుదలవుతుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. మరి సెంటిమెంట్ ప్రకారం ‘పుష్ప 2’ మూవీ కూడా హిట్ అవుతుందనే ఆశాభావం రష్మికతో పాటు ఆమె అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

6 /6

పుష్ప 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 617 కోట్ల షేర్ (రూ. 1200 కోట్ల గ్రాస్) ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే రూ. 620 కోట్ల షేర్ (రూ. 1200 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాలి. మరి పుష్ప 2 మూవీ ముందు పెద్ద టార్గెటే ఉంది.