Rashmika Mandanna: విజయ్ దేవరకొండ లాగే మాట్లాడుతోందే.. రష్మికపై నెటిజన్స్ కామెంట్స్..!

Pushpa 2 event : నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా పుష్ప ఈవెంట్.. జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రష్మిక, శ్రీ లీల ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని చర్చలకు దారితీస్తున్నాయి. రష్మిక పూర్తిగా విజయ్ దేవరకొండ లాగా మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నాడు అభిమానులు.

1 /5

టాలీవుడ్ లో నిరంతరం రూమర్స్ తో నిలిచే జంటలలో రష్మిక, విజయ్ దేవరకొండ జంట కూడా ఒకటి.. మొదటిసారి గీతాగోవిందం సినిమాతో మొదలైన రూమర్స్ ఇప్పటికీ వీరి గురించి వినిపిస్తూ ఉంటాయి.. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇటీవల పుష్ప-2 సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్లో వేగవంతం గా పాల్గొంటుంది.   

2 /5

ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారనే  రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి.  అంతేకాకుండా ఇటీవలే పుష్ప -2 ప్రమోషన్స్లో రష్మిక  సుదీర్ఘంగా తెలుగులో మాట్లాడడం జరిగింది. అయితే ఆమె మాట్లాడిన యాస తెలంగాణ యాస.. అయితే విజయ్ దేవరకొండ మాట్లాడే విధానంతో రష్మిక మాట్లాడే విధానం పోలికగా ఉందని ఈ విషయం విన్న అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.

3 /5

రష్మిక గతంలో మాట్లాడే మాటలకు ఇప్పుడు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రష్మిక మాట్లాడే ప్రతి మాట కూడా విజయ్ దేవరకొండ లాగానే ఉందని అభిమానులైతే భావిస్తున్నప్పటికీ వీరి నుంచి వచ్చే రూమర్స్ ని మాత్రం వీరిద్దరూ ఖండించలేదు. 

4 /5

ఇటీవలే ఇద్దరు కలిసి ఏదో రెస్టారెంట్లో భోజనం చేస్తున్నట్లుగా ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది.. దీంతో రూమర్స్ కి మరింత బలం చేకూరుతోంది. విజయ్ దేవరకొండ కూడా తాను సింగిల్గా అయితే లేనని తెలిపారు. రష్మిక కూడా పుష్ప-2 సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన బాయ్ ఫ్రెండ్ ఎవరని యాంకర్ అడిగినప్పుడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే అంటూ నవ్వుతూ సమాధానాన్ని తెలియజేసింది.. ఇలా మొత్తానికి అటు రష్మిక, విజయ్ దేవరకొండ విషయం పైన రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

5 /5

మొత్తానికైతే భాష కూడా విజయ్ దేవరకొండ లాగే మాట్లాడుతూ ఇక ఆయనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.