World largest Mosque: ప్రపంచంలోని అతి పెద్ద, చారిత్రాత్మకమైన 10 మసీదులు ఇవే

రంజాన్ నెల ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరిస్తున్నారు. ఈ నెలలో అత్యధిక సమయం దైవారాధనలో గడుపుతుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మసీదులు ఈ నెలలో కళకళలాడుతుంటాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అందమైన, అతిపెద్ద, చారిత్రాత్మక మసీదుల గురించి తెలుసుకుందాం.

World largest Mosque: రంజాన్ నెల ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు కఠిన ఉపవాసాలు ఆచరిస్తున్నారు. ఈ నెలలో అత్యధిక సమయం దైవారాధనలో గడుపుతుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మసీదులు ఈ నెలలో కళకళలాడుతుంటాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని అందమైన, అతిపెద్ద, చారిత్రాత్మక మసీదుల గురించి తెలుసుకుందాం.
 

1 /10

షేక్ జైద్ రోడ్ గ్రాండ్ మస్జిద్, అబూ దాబి ఈ మసీదు అత్యద్భుతమైన తెల్లటి పాలరాతి గోడలు, పూల డిజైన్లు, ఝుమ్రూలకు ప్రసిద్ధి.

2 /10

మస్జిద్ ఎ నబవి, మదీనా మొహమ్మద్ ప్రవక్త మదీనాకు వలస రావడంతో ప్రపంచంలో రెండవ అతి పవిత్రమైన సందర్శనీయ క్షేత్రంగా మారింది. 

3 /10

జామా మసీదు, ఢిల్లీ 17వ శతాబ్దంలో నిర్మించిన ఇండియాలోని అతి పెద్ద మసీదు ఇది.

4 /10

మస్జిద్ ఇస్తిక్లాల్, ఇండోనేషియా దక్షిణ తూర్పు ఆసియాలోనే అతి పెద్ద మసీదు. ఇందులో ఒకేసారి 2 లక్షల కంటే ఎక్కువమంది నమాజ్ చేయవచ్చు.

5 /10

ఇమామ్ రేజా ష్రైన్, ఇరాన్ ఇది షియా ముస్లింలకు పవిత్రమైన స్థలం. 8వ ఇమామ్ సమాధిపై నిర్మించింది. ప్రముఖ తీర్ధక్షేత్రం

6 /10

మస్జిద్ హసన్, మొరాకో ఈ మసీదు ప్రపంచంలోని అతి ఎత్తైన మీనార్లు కలిగిన మసీదుల్లో ఒకటి. వీటి మీనార్ల పొడవు 175 మీటర్లు. 

7 /10

మస్జిద్ ఎ ఫైసల్, పాకిస్తాన్ ఇది ఇస్లామాబాద్‌లో ఉంది. విశాలమైన గొడుగు ఆకారంలో ఆధునిక ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన మసీదు

8 /10

డజ్మా ఎల్ బజార్, అల్జీరియా అల్జీరియాలోని అతి పెద్ద మసీదు ఇది. మెడిటేరియన్ తీరంలో ఉంది.

9 /10

బాద్ షాహీ మసీదు, లాహోర్ 17వ శతాబ్దంలో నిర్మించిన పాకిస్తాన్‌లోని అతిపెద్ద మసీదుల్లో ఒకటి. మొఘల్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి

10 /10

మస్జిద్ అల్ హరమ్-మక్కా ప్రపంచంలో అతి పెద్ద మసీదే కాకుండా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన సందర్శనీయ క్షేత్రం. ప్రతియేటా హజ్ యాత్రకు ఇక్కడికే వస్తుంటారు.