Ram Charan latest news : గేమ్ చేంజర్ సినిమా కారణంగా నష్టాలు వాటిల్లిన నేపథ్యంలో.. తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటానని హామీ ఇవ్వడమే కాకుండా దిల్ రాజుతో మరో ప్రాజెక్టు చేస్తానని కూడా తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి బరిలో దిగిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ నెగిటివ్ రివ్యూస్ వల్ల ఈ సినిమా పైన భారీగా దెబ్బ పడినట్లు కనిపిస్తోంది.
దీంతో కలెక్షన్స్ పైన తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా నిర్మాత దిల్ రాజుకు భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం పైన రామ్ చరణ్, దిల్ రాజుకు సైతం అండగా ఉంటూ తనతో కచ్చితంగా ఒక సినిమా చేస్తానంటూ మాట ఇచ్చారట.
గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయగా రూ.200 కోట్లకు పైగా నష్టాలను తీసుకువచ్చింద ఈ చిత్రం. ఇండియాలో రూ.186 కోట్లు.. అలాగే ఉత్తర అమెరికాలో 1.98 మిలియన్లు మాత్రమే కలెక్షన్స్ సాధించిందట. దీంతో ఈ సినిమాకి భారీ నష్టం వాటిల్లింది. అందుకే రాంచరణ్ తన రెమ్యూనరేషన్ తగ్గించి మరీ.. దిల్ రాజుకు మద్దతు పలికినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా విడుదలైన తర్వాత దిల్ రాజుతో ఒక ప్రాజెక్టు చేసేందుకు కూడా రాంచరణ్ సిద్ధపడ్డారట. అంతేకాకుండా తను పెంచిన రెమ్యునరేషన్ ను కాకుండా రెగ్యులర్ రెమ్యూనరేషన్ తీసుకుంటా అంటూ హామీ ఇచ్చారట రామ్ చరణ్.
ఈ విషయం తెలిసి చాలామంది అభిమానులు రాంచరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిల్ రాజు రామ్ చరణ్ కాంబినేషన్లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్నదట. గేమ్ ఛేంజర్ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా లేకపోవడంతో విజయం సాధించలేక పోయిందట. దీంతో నిర్మాతలు కూడా మంచి కథల పైన దృష్టి పెట్టడం మంచిదని పలువురు నెటిజన్స్ సైతం భావిస్తున్నారు. ప్రస్తుతమైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది.