Rakshi Purnima festival: రక్షా బంధన్‌ను తోబుట్టువుల మధ్య ఒకరికొకరు తమ ప్రేమను చాటుకునే గొప్ప పండుగ. ఈ రోజున.. సోదరీమణులు తమ సోదరుడి క్షేమం కోసం రాఖీలు కడుతుంటారు.
ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఆగస్టు 19 న రాఖీ వేడుకను పండగలా జరుపుకొవడానికి అందరు అరెంజ్ మెంట్స్ లో బిజీగా ఉన్నారు. తమ సోదరుకు రాఖీ కట్టడానికి అక్కాచెల్లెమ్మలు, వారికి ఎలాంటి గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలని అని అన్నతమ్ములు బిజీగా అయిపోయారు. ఈ క్రమంలో రాఖీలు వారి రాశి ప్రకారం .. వారికి కలిసి వచ్చే రంగుల రాఖీని కడితే.. మరింత అదృష్టం కలిసివస్తుందని పండితులు చెబుతుంటారు.
మేషం (Aries ) ఈ రాశికి చెందిన వ్యక్తులు ధైర్యంగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. మీ సోదరుడు మేషరాశి అయితే వారికి తప్పకుండా.. ఎరుపు రంగు రాఖీ కడితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
వృషభం (Taurus) మీ సోదరుడు వృషభరాశి అయితే, ఎర్రటి తిలంకం పెట్టిన తర్వాత పూసిన తర్వాత అతనికి ఆకుపచ్చ రంగు రాఖీని కట్టండి. ఆకుపచ్చ రంగు జీవితంలో పెరుగుదల, స్థిరత్వాన్ని సూచిస్తుంది.
మిథునం (Gemini) ఈ రాశిచక్రం మెర్క్యురీచే పాలించబడుతుంది. కాబట్టి, ఈ రాశి సోదరులు తమ మణికట్టుకు పసుపు రాఖీని కట్టాలి. ఈ సంకేతాలు ఉన్న వ్యక్తులు ద్వంద్వ స్వభావం, స్నేహశీలియైన ప్రవర్తన కలిగి ఉంటారు.
కర్కాటకం (Cancer) కర్కాటకం సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి తెలుపు లేదా వెండి రంగు వారికి బాగా సరిపోతుంది. ఈ రంగులు సున్నితమైన వ్యక్తిత్వంతో ప్రతిబింబిస్తాయి.
సింహరాశి(Leo) మీ సోదరుడు సింహరాశి అయితే, గోల్డ్ కలర్ రాఖీని కట్టండి. ఈరంగ రాఖీ.. మీ సోదరునిలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంచుతుంది.
కన్య (Virgo) ఒక సోదరి తన సోదరుని మణికట్టుపై ఆకుపచ్చ రాఖీని కట్టినట్లయితే, అది అతని అసంపూర్తిగా ఉన్న అన్ని పనులను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఈ రంగు జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది.
తుల (Libra) తులారాశి వారి జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ప్రసిద్ధి చెందింది. అందువల్ల, గులాబీ లేదా లేత నీలం రంగులు కలిసి వస్తాయి. వీరు ఎల్లప్పుడు కూడా ప్రశాంతంగాఉంటారు.
వృశ్చికం (Scorpio) మీ సోదరుడు శరదృతువులో జన్మించినట్లయితే, అతని మణికట్టుపై ఎరుపు లేదా మెరూన్ రంగు రాఖీని కట్టండి. ఇది వారి రహస్యమైన మరియు శక్తివంతమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబించేలా చేస్తుంది.
ధనుస్సు (Sagittarius) ఈ వ్యక్తులు సాధారణంగా చాలా ఆశావాదులు. అంతేకాకుండా.. తాత్విక స్వభావం కలిగి ఉంటారు. ఊదా లేదా ముదురు నీలం రాఖీని కట్టండి, ఎందుకంటే ఇది సృజనాత్మకత, విస్తృతమైన ఆలోచనను సూచిస్తుంది.
మకరం (Capricorn) ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసేవారు. మీ సోదరుడు మకరరాశి అయితే గోధుమ రంగు రాఖీని ఎంచుకోండి. అది వారి క్రమశిక్షణ, ప్రతిష్టాత్మక స్వభావాన్ని సూచిస్తుంది.
కుంభం (Aquarius) వెండి లేదా బంగారు రంగు రాఖీలను సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు కట్టాలి.
మీనం (Pisces) సోదరీమణులు తమ మీన సోదరుడికి సీ గ్రీన్ లేదా లావెండర్ రంగు రాఖీని కట్టాలి. వీరిలైఫ్ లో ఉన్నతంగా ఎదుగుతారు. మంచి వ్యక్తిత్వంను కలిగి ఉంటారు.