Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

మన జీవితంలో కలలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు తరచుగా కలలో కొన్ని విచిత్రమైన వస్తువులను, సంఘటనలను చూస్తారు. వాటితో మన జీవితానికి సంబంధం లేదని భావిస్తారు. కానీ మనం కలల శాస్త్రాన్ని(Swapan Shastram) విశ్వసిస్తే, ప్రతి కలకి ఓ ప్రత్యేకమైన అర్ధం ఉందని నమ్ముతారు. పురాణాలలో రావణుడు సైతం చనిపోయే ముందు అతడికి పీడకల వచ్చిందని, తన మరణానికి సంబంధిత చెడు సంకేతాలు వచ్చాయని పెద్దలు చెబుతారు.

  • Apr 26, 2021, 14:15 PM IST

Rainbow In Dreams: మన జీవితంలో కలలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొందరు తరచుగా కలలో కొన్ని విచిత్రమైన వస్తువులను, సంఘటనలను చూస్తారు. వాటితో మన జీవితానికి సంబంధం లేదని భావిస్తారు. కానీ మనం కలల శాస్త్రాన్ని(Swapan Shastram) విశ్వసిస్తే, ప్రతి కలకి ఓ ప్రత్యేకమైన అర్ధం ఉందని నమ్ముతారు. పురాణాలలో రావణుడు సైతం చనిపోయే ముందు అతడికి పీడకల వచ్చిందని, తన మరణానికి సంబంధిత చెడు సంకేతాలు వచ్చాయని పెద్దలు చెబుతారు.

1 /4

నిద్రించాక వచ్చే కలలో కొన్ని విషయాలు మనకు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. మంచి జరిగే విషయాలు, వస్తువులు కనిపిస్తే అంతా శుభమని భావిస్తారు, కొన్ని విషయాలను చూడటం చెడు జరుగుతుందని సూచిందని నమ్ముతారు. మనం కలలో ఇంద్రధనస్సు(Rainbow in Dream)ను చూస్తే ఏం జరుగుతుంది. మీరు కలలో ఇంద్రధనస్సు చూడటం ఒక శుభ సంకేతంగా భావించ వచ్చు. ఎందుకంటే దాని గురించి ఇక్కడ తెలుసుకోండి. Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

2 /4

కలల శాస్త్రం(Swapan Shastram) ప్రకారం, ఎవరైనా వారి కలలో ఇంద్రధనస్సు చూసినట్లయితే అది మంచికి సంకేతమని భావించవచ్చు. మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఎదురుచూస్తున్నాయని పెద్దలు విశ్వసిస్తారు. దీనిపై ఏ భయాలు, ఆందోళన అక్కర్లేదు.

3 /4

హాయిగా నిద్రిస్తున్న మీకు కలలో ఇంద్రధనస్సు కనిపించిందా.. అయితే మీ జీవితంలో కీర్తి, పరువు మరియు ప్రతిష్ట పెరుగుదలను అది సూచిస్తుంది. కలలో ఇంద్రధనస్సు రావడం అంటే ఉద్యోగులు పనిలో విజయాన్ని అందుకుంటారని నమ్మకం. వ్యాపారులకైతే పెట్టుబడులకు తగిన లాభాలను ఆర్జిస్తారని విశ్వసిస్తారు. ఏది ఏమైతేనేం శుభాలు, లాభాలు మీకోసం ఎదురుచూస్తున్నాయని భావన ప్రజలలో ఉంటుంది. Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

4 /4

వివాహితుడు అయిన పురుషులకు కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే, వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అవివాహితులకు అంతా సాధారణంగా ఉండనుంది. అదే పెళ్లయిన మగవారికి సంతోషం, శుభాలు ఎదురుచూస్తున్నాయని సంకేతంగా భావిస్తారు. వివాహం అయిన మహిళలకు కలలో ఇంద్రధనస్సు కనిపిస్తే, వారికి కష్టాలు తప్పవు. భర్తకు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం సాధారణ సమాచారం మరియు వ్యక్తుల విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందరికీ వర్తించకపోవచ్చు. జీ న్యూస్ ఈ విషయాలను నిర్ధారించలేదు) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook