Rahu Transit 2024 To 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతువు గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు. రాహువు, కేతువు గ్రహాలు చాలా అరుదుగా ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాయి. ఈ గ్రహాలు సంచారం సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అంటే మొత్తం రాశి చక్రాలు పూర్తి కావడానికి దాదాపు 18 సంవత్సరాల పాటు సమయం పడుతుంది.
రాహువు గ్రహం అక్టోబర్ 2023 సంవత్సరంలో మీన రాశిలోకి సంచారం చేసింది. మళ్లీ ఈ గ్రహం 2025 సంవత్సరంలో మీన రాశిని వదిలి శని గ్రహం పాలించే కుంభ రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా మళ్లీ అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
ఈ గ్రహం వచ్చే ఏడాది మే 18వ తేదిన కుంభ రాశిలోకి సంచారం చేస్తుంది. ఆ తర్వాత ఈ గ్రహం 18 నెలల పాటు కుంభ రాశిలో ఉండి.. ఇతర గ్రహంలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
వచ్చే సంవత్సరంలో రాహువు సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
మేష రాశివారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా సులభంగా చేస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరలతో కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి.
కన్యా రాశివారికి రాహువు సంచారం చేయడం వల్ల ఎంతో బాగుంటుంది. వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. దీంతో పాటు అనేక సవాలు అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మెరుగుపడతాయి. అంతేకాకుండా వాణిజ్య రంగాల్లో పనులు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా నెలకొంటాయి.
రాహువు సంచారం చేయడం వల్ల ధనస్సు రాశివారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది.
ధనుస్సు రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా వీరికి మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి మిత్రలు సపోర్ట్ లభించి అనుకున్న పనులు చేయగలుగుతారు.