Shani Nakshatra Transit: శని సంచారంతో ఈ రాశుల వారికి స్వర్ణయుగం.. ఇక దశ తిరిగినట్లే..!

Shani Nakshatra Transit 2024 Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ కదలికతో 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ఆ రాశి వ్యక్తుల కర్మ ఫలాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. శని సంచారంతో ఏ రాశి వాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది..? ఏ రాశి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? పరిష్కార మార్గాలు ఏంటి..? వివరాలు మీ కోసం..
 

1 /14

మేష రాశి వారు వృత్తిపరంగా సవాళ్లను ఎదుర్కోనే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఒత్తిడికి లోనవుతారు. ఖర్చులు తగ్గించుకుని.. పొదుపు వైపు అడుగులు వేస్తారు.   

2 /14

వృషభ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. తోబుట్టువులతో మనస్పర్థలు తొలగిపోతాయి.  

3 /14

మిథున రాశి ఆఫీసులో ఎక్కువ పనిచేయాల్సి రావచ్చు. ఈ రాశి వారు అసూయపడే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని అప్పులు చెల్లించాల్సిన సమయం వచ్చింది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.  

4 /14

కర్కాటక రాశి వ్యక్తులకు కొత్త మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది.   

5 /14

సింహ రాశి వారు భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.  

6 /14

కన్యా రాశి వారికి శని సంచారంతో కలిసి వస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.    

7 /14

తుల రాశి వారు వృత్తిపరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించండి.  

8 /14

వృశ్చిక రాశి వ్యక్తులు వృత్తిపరంగా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాన్ని కొత్త మార్గంలో అభివృద్ధి చేయండి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువ లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.   

9 /14

ధనుస్సు రాశి వారికి ఇది అద్భుత సమయం. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది.  

10 /14

మకరరాశి వారికి వ్యాపారంలో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉంటాయి.   

11 /14

కుంభ రాశి వారికి బిజినెస్‌లో కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. ఆదాయంలో పెరుగుతుంది.  

12 /14

మీన రాశి వారు స్ఫూర్తితో నిండి ఉంటారు. కార్యాలయంలో మరిన్ని బాధ్యతలు పెరగవచ్చు. అదేవిధంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉదాసీనతకు చోటు ఇవ్వకండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.   

13 /14

శని చాలీసా, హనుమాన్ చాలీసా పఠిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. అదేవిధంగా దానధర్మాలు, పేదలకు సహాయం చేసేవారిని శని దేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు.   

14 /14

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు ఆధారంగా రాసినంది. ఈ సమాచారాన్ని జీ తెలుగు మీడియా ధృవీకరించలేదు.