Pushpa2: పుష్ప2లో అల్లు అర్జున్‌ కట్టుకున్న ఈ చీర ఎవరిది? ఎందుకు అంతలా ఊగిపోయాడు తెలుసా?

Pushpa2 Allu Arjun Saree: పుష్ప2 సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. రేటు పెంచడం వల్ల ప్రేక్షకులు కాస్త మందగించినా సినిమాపరంగా చూస్తే మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా నెగిటీవ్‌ టాకర్స్‌ నుంచి కూడా పాజిటివ్‌ రెస్పన్స్‌ వస్తోంది. అయితే, ఈ సినిమాలో గంగమ్మ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సీన్‌లో బన్నీ కట్టుకున్న ఆ చీర ఎవరిది? ఎందుకు అంతలా ఊగిపోయాడు తెలుసా?
 

1 /7

పుష్ప2 కలెక్షన్ల పరంగా అన్నీ రికార్డులను బద్దలు కొడుతోంది. అయితే, టిక్కెట్ల ధర తగ్గితే బాగుండు సినిమా చూద్దాం అని ఆతృతతో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు.  

2 /7

ప్రస్తుతం ఈ సినిమా డిసెంబర్ 5 న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ హీరోగా నటించగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. మళయాల నటుడు ఫాహద్ ఫసీల్‌ కూడా విలాన్‌ పాత్ర పోషించాడు.  

3 /7

ఈ చిత్రంలో బన్నీ నటనకు నూటికి నూరు శాతం మార్కులు వేస్తున్నారు. అయితే, తిరుపతి గంగాలమ్మ జాతర ఈ సినిమాకు హైలట్‌గా నిలిచింది.  

4 /7

ఈ సీన్‌లో బన్నీ నటన అందరినీ ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌ ఈ సీన్‌లో ఓ నీలిరంగు చీర ధరించి చేసిన ఫైట్‌ సీన్‌ అదరగొడుతోంది. ఈ సీన్‌ సినిమానే ఓ లెవల్‌కు తీసుకెళ్లింది.  

5 /7

అయితే, ఈ జాతర సీన్‌లో అల్లు అర్జున్‌ ధరించినా ఆ చీర ఎవరిది? అని ట్రెండ్‌ అవుతోంది. అవును ఆ చీర బన్నీ అమ్మగారిది. వాళ్ల అమ్మ చీరనే బన్నీ గంగమ్మ జాతర సీన్‌లో కట్టుకున్నాడు.  

6 /7

ఈ సినిమా మంచి సక్సెస్‌ అందుకుని కలెక్షన్ల పరంగా కూడా మంచి టాక్‌ను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో రష్మిక డ్యాన్స్‌ కూడా అదిరిపోయింది. బన్నీతో పోటీ పడి మరీ చేసినట్లుంది.  

7 /7

అయితే, సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేసినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా ఆమె కుమారుడికి తీవ్ర గాయలు అయ్యాయి. మహిళ చనిపోగా, బాబుకు చికిత్స అందిస్తున్నారు. ఇక బన్నీ ఓ వీడియో సంతాపం తెలియజేశారు. రూ.25 లక్షలు ఆ కుటుంబానికి ప్రకటించారు.