Top Small Business Ideas: కేవలం రూ. 50 వేల మెషీన్‌తో ఇంట్లో కూర్చొని రూ.7,00,000 లక్షలు సంపాదించవచ్చు..!


Printed T-shirt Business: కొత్తగా, ట్రేడింగ్‌గా ఉండే బిజినెస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్‌ మీకు ఎంతో పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. కేవలం రూ.  వేల మెషీన్‌తో ఇంట్లో కూర్చొని  సంవత్సరానికి  రూ.7,00,000 లక్షలు సంపాదించవచ్చు. ఎక్కువ శ్రమ కూడా ఉండదు. అధిక పెట్టుబటి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతటీ ఈ బిజినెస్‌ ఎలా స్టార్ట్‌ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. 
 

Printed T-shirt Business: నేటి తరం యువత, మహిళలు వ్యాపార రంగంలో కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.  ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు మార్కెట్‌ ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఈ వ్యాపారం ఇంట్లో ఉండే మహిళలు, యువత కూడా ప్రారంభించవచ్చు. దీంతో  ఉద్యోగంలో వచ్చే స్థిరమైన జీతం కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి తరం ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం ఎంతో ట్రేడింగ్‌గా ఉండటంతో పాటు సంవత్సరానికి ఏడు లక్షలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం ఏంటి? ఎలా ప్రారంభించాలి ? అనే వివరాలు తెలుసుకుందాం. 

1 /8

ప్రస్తుత కాలంలో క్రియేటివిటీని వ్యాపారంగా మార్చి లాభాలు గడించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్న ప్లాన్‌తో చాలా మంది లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారం స్టార్ట్‌ చేయడం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం అతి తక్కువ ఖర్చుతో బోలెడు లాభాలు పొందవచ్చు. అందులో ఒకటి ప్రింటెడ్‌ టీ-షర్ట్ బిజినెస్‌.   

2 /8

ప్రింటెడ్ టీ-షర్ట్ వ్యాపారం అనేది క్రియేటివిటీని, వ్యాపారాన్ని ఒకే చోట కలిపే ఒక ఆసక్తికరమైన అవకాశం. చాలా మంది టీ-షర్ట్‌పై బొమ్మలు వేయడం అని అనుకుంటారు. కానీ ఈ బిజినెస్‌తో మీ ఆలోచనలను, భావాలను, కళను ప్రపంచంతో పంచుకోవచ్చు. 

3 /8

ఈ వ్యాపారం మొదలు పెట్టడాని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. కేవలం రూ.40 నుంచి 50 వేల పెట్టుబడితో నెలకు రూ. 60 వేల నుంచి సంవత్సరానికి రూ. 7 లక్షలు సంపాదించవచ్చు. దీన్ని ఎలా ప్రారంభించాలి అనే విషయాలు తెలుసుకుందాం.

4 /8

ప్రింటెడ్ టీ-షర్ట్ బిజినెస్‌ కోసం ఒక మెషీన్‌ ఉంటే సరిపోతుంది. ఈ వ్యాపారాన్నికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. మెషీన్‌ కోసం కేవలం రూ. 60 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేటి యువత ప్రింటెడ్ టీ- షర్ట్‌ ధరించడానికి ఎక్కువ మక్కువ చూపుతుంది. 

5 /8

ఈ బిజినెస్‌తో  నెలవారీ ఆదాయం రూ.50 నుంచి 60 వేలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఈ వ్యాపారం కోసం మీరు ఎలాంటి షాపులు తెరవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే ఈ బిజినెస్‌ ప్రారంభించవచ్చు. ఎక్కువ శ్రమ కూడా ఉండదు. కేవలం మెషీన్‌తో షర్ట్‌లను ప్రింట్‌ చేస్తే సరిపోతుంది. ఈ షర్ట్‌లను మార్కెట్‌లో రెట్టింపు ధరకు అమ్మవచ్చు. 

6 /8

టీ- షర్టు ప్రింటింగ్ మెషిన్ ధర రూ. 10 వేల నుంచి  40 వేల ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణ టీ షర్ట్‌లను బయట కొనుగోలు చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌ స్టోర్‌లలోకూడా పొందవచ్చు. వీటి పై మీరు వివిధ రకాల డిజైన్‌లను ముద్రించి మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. 

7 /8

ఈ బిజినెస్‌తో మీరు నెలకు  రూ. 60 వేల  సంపాదించవచ్చు. బయట డిమాండ్‌లను బట్టి ఎక్కువ ధర, సామాన్య ప్రజలు కొనుగోలు చేసే ధరకు అమ్మవచ్చు. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి రూ. 7 లక్షలు సంపాదించవచ్చు.   

8 /8

మీ బిజినెస్‌కు మరింత డిమాండ్‌ పెరగాలంటే మీ ప్రింటెడ్ టీ-షర్ట్ లను  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజ్జియో వంటి ఆన్‌లైన్ స్టోర్‌లకు మార్కెటింగ్‌ పొందవచ్చు. దీంతో మీ బ్రాండ్‌ కూడా మార్కెట్‌లో గుర్తింపు లభిస్తుంది.