PMAY: కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం..ఎలా దరఖాస్తు చేయాలంటే.?

Prime Minister Awas Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీన స్కీమ్ కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా  పెట్టుకుంది. ఇందులో భాగంగానే లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ స్కీముకు ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /8

Prime Minister Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద, ప్రభుత్వం 3 కోట్ల అదనపు గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెలవారీ రూ.15,000 ఆదాయం ఉన్నవారు కూడా అర్హులే. లబ్ధిదారులకు 90 రోజుల్లో గృహాలు మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సులభం. అర్హులను గుర్తించేందుకు త్వరలో సర్వే జరగనుంది.

2 /8

పేద, మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక సూపర్ అవకాశం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గృహ వసతి కల్పించడం దీని లక్ష్యం. ఈ పథకాన్ని 2015 జూన్ 25న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుండి లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఇది సహాయపడుతోంది.   

3 /8

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 కింద, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదనంగా 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ స్కీం కోసం ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0లో అర్హత ప్రమాణాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. దీని కారణంగా ప్రజలు పథకం  అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇంతకుముందు, నెలవారీ ఆదాయం రూ. 10,000 వరకు ఉన్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు.   

4 /8

ఇప్పుడు ఈ పరిమితిని నెలకు రూ.15,000కు పెంచారు. ఇది కాకుండా ఇప్పటికే ఉన్న అనేక షరతులు సడలించారు. అర్బన్,  గ్రామ స్థాయిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీరు ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల వ్యక్తులు PM ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmaymis.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.   

5 /8

వెబ్ సైట్లో  "Benefits under the other 3 parts" అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నంబర్, పేరు నమోదు చేయండి. ఆధార్ నంబర్‌ను ధృవీకరించిన తర్వాత, దరఖాస్తుదారు తన వివరాలన్నింటినీ పూరించాల్సిన దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, క్యాప్చాను నమోదు చేసి, "సేవ్" బటన్పై క్లిక్ చేయండి.  

6 /8

దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని.. దాని ప్రింట్ అవుట్‌ను తీసుకొని భద్రంగా ఉంచండి. దీని తర్వాత, సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా బ్యాంకును సందర్శించండి. అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి. వెబ్‌సైట్‌లో ID లేదా పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ ను ట్రాక్  చేయవచ్చు. 

7 /8

కుటుంబంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడి వయస్సు 70 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తుదారు లేదా అతని కుటుంబ సభ్యుల పేరుతో ఇల్లు ఇప్పటికే ఉండకూడదు. లబ్దిదారుడు ఇంతకు ముందు ఏ ప్రభుత్వ గృహనిర్మాణ పథకం నుండి ప్రయోజనం పొంది ఉండకూడదు. ఇంటి యాజమాన్యం మహిళ పేరు మీద ఉండాలి.  

8 /8

ఈ పథకాన్ని ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS), తక్కువ ఆదాయ సమూహం (LIG), మధ్య ఆదాయ సమూహం-I (MIG-I), మధ్య ఆదాయ సమూహం-II (MIG-II) అనే నాలుగు వర్గాల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా వర్గాలకు ఆర్థిక ప్రమాణాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందుబాటులో ఉంటుంది.