Pregnancy: ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసేవారు ఈ 3 నివారించాలి.. లేదంటే ఆ సమస్య ఎప్పటికీ వేధిస్తుంది..

Pregnancy Planning Tips: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో 30-35 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో ప్రెగ్నెన్సీ కూడా ఆలస్యం అవుతుంది. దీంతో ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. సంతాన సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు చాలా మంది లక్షల్లో సైతం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, మీరు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్న దంపతులు ఈ కాలంలో అధిక శాతం వయస్సు తో పాటు వస్తున్న సమస్యలతో బాధపడతున్నారు. ముఖ్యంగా సరైన వయస్సులో పెళ్లి చేసుకుంటే అదేవిధంగా సరైన వయస్సులో పిల్లలను కనాలనుకుంటే ఈ సమస్యలు వేధించవు..  

2 /5

ముఖ్యగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ స్ట్రెస్ ఉండకూడదు. ముఖ్యంగా స్ట్రెస్‌ వల్ల హార్మోన్‌ అసమతులత ఏర్పడుతుంది. దీంతో పిల్లలను కనడానికి మార్గం సుగమం కాదు. అంతేకాదు స్ట్రెస్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.  

3 /5

మద్యపానం, ధూమపానం ఇవి ఎప్పటికీ మన ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ఈ రెండిటికీ దూరంగా ఉంటే మీరు నిత్యయవ్వనంతోపాటు దీర్ఘాయువు కలిగి ఉంటారు. గర్భానికి ప్లాన్‌ చేస్తున్న మహిళలు ఈ రెండిటీ దూరంగా ఉండాలి.

4 /5

కొవ్వు.. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న వారు ముఖ్యంగా మంచి లైఫ్ స్టైల్‌ నిర్వహించాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ కొవ్వు ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ ను సైతం పెంచేస్తాయి.

5 /5

అంతేకాదు ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేస్తున్న మహిళలు కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాదు వీరి శారీరకంగా కూడా యాక్టీవ్‌గా ఉండాలి. గర్భం ప్లాన్‌ చేస్తున్న మహిళలు ఎప్పుడూ ఏదో ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉండాలి. దీంతో హార్మోనల్ బ్యాలన్స్‌ కాకుండా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )