Post Office Scheme: దుమ్ము రేపుతున్న కొత్త పోస్టాఫీస్ స్కీమ్‌.. ఇంట్లో కూర్చొనే ప్రతినెల రూ.5,001 వడ్డీ పొందండి..

Post Office Interest Scheme: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మంథ్లి ఇన్‌కమ్ స్కిమ్‌లో భాగంగా కేంద్ర పోస్టాఫీస్‌ ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇప్పటికే అకౌంట్‌ ఉన్నవారు ప్రతి నెల వడ్డీని కూడా అందిస్తోంది. అయితే ఈ వడ్డీ ఆదాయం అనేది మీరు పెట్టిన మొత్తంపై అధారపడి ఉంటుంది. ఇందులో నుంచి ఎక్కువ ఆదాయం పొందడానికి భారీ మొత్తం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
 

1 /6

ఈ పోస్టాఫీస్ సేవింగ్స్ పథకంలో భాగంగా ఎక్కువ వడ్డీ పొందాలనుకునేవారు ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెడితే 7.4 శాతం వడ్డీ లభించే అవకాశాలు ఉన్నాయి. 

2 /6

ఈ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్‌ చేసేవారు తప్పకుండా రూ. 1000ను అకౌంట్‌లో మెయిటెన్‌ చేయాల్సి ఉంటుంది. ఇక అధిక వడ్డీ పొందాలనుకుంటే.. ఈ అకౌంట్‌లో భారీ మొత్తంలో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది.  

3 /6

ఈ అకౌంట్‌లో గరిష్టంగా దాదాపు రూ.9 లక్షల వరకు పెట్టుబడిగా ఉంచే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే మరింత పెట్టుబడి పెట్టాలనుకునేవారు జాయింట్‌ అకౌంట్‌ను కూడా తీసుకునే ప్రత్యేకమైన సదుపాయాన్ని అందిస్తోంది.

4 /6

ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేవారికి కూడా పోస్టాఫీస్‌ ప్రత్యేకమైన లిమిట్‌ ఆప్షన్‌ను అందిస్తోంది. అయితే ఈ అకౌంట్‌లో గరిష్టంగా దాదాపు 15 లక్షలకు పైగా పెట్టుబడిని పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  

5 /6

10 ఏళ్ల వయస్సులోపు ఉన్న చిన్న పిల్లలకు కూడా పోస్టాఫీస్‌ ఈ పథకంలో భాగంగా ప్రత్యేకమైన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా వారి తరుపున గార్డియన్లు ఎవరైనా ఇందులో ఖాతా ఓపెన్‌ చేసి డబ్బులు పెట్టుబడిగా పెట్టొచ్చు.

6 /6

ఇక ఇందులో నెలవారి వడ్డీ విషయానికొస్తే..ఈ అకౌంట్‌లో రూ.8,11,000 డిపాజిట్ చేస్తే.. ప్రతి నెల ఏం లేకున్న 7.4 శాతం వడ్డీ రేటుతో ఏకంగా రూ.5,001 వడ్డీని పొందవచ్చు.