Pooja Hegde: టుట్టి ఫ్రూటీ లంగావోణీలో పూజా హెగ్డే.. ఈ లంగావోని ధర తెలిస్తే షాకే

Pooja Hegde in Half Saree: వరస ప్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో మాత్రం వరసగా సూపర్ స్టైలిష్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

  • Jan 23, 2024, 20:35 PM IST
1 /6

Pooja Hegde in Half Saree: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తరువాత ముకుందా సినిమాలో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

2 /6

వరసగా స్టార్ హీరోల సినిమాలలో చాన్సులు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అరవింద సమేత.. అలా వైకుంఠపురం లో లాంటి సూపర్ హిట్ సినిమాలలో సైతం నటించింది.

3 /6

ఇక పూజా హెగ్డే కి తిరుగులేదు అనుకున్న సమయంలో ఈ హీరోయిన్ కి వరస ప్లాపులు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా గత సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు చవిచూసింది ఈ బుట్ట బొమ్మ.

4 /6

2023లో వచ్చిన పూజా హెగ్డే సినిమాలు అన్నీ అత్యంత డిజాస్టర్స్ గా మిగిలాయి. రాదే శ్యామ్ ..ఆచార్య.. బీస్ట్.. సినిమాలు చేసి వరుసగా ఆమె ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తూ వచ్చింది.

5 /6

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో పూజ షేర్ చేసిన ఫోటోలు మాత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆకుపచ్చ.. గులాబీ లంగా వోణీలు టుట్టి ఫ్రూటీ లుక్స్ తో చాలా క్యూట్ గా కనిపించింది పూజ.

6 /6

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తాన్యా డిజైన్ చేసిన ఈ లంగా వోని విలువ అక్షరాల ₹1.39 లక్షలు. ఇక ఈ లంగా వోణీలో పూజ హెగ్డే అందాలు ఏమిరా బాబు ఈ అందం అనేలా చేస్తున్నాయి.